షాకింగ్ రేటుకు సూర్య ‘రెట్రో’ఓటిటి రైట్స్ !

First Published | Jan 16, 2025, 11:09 AM IST

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'రెట్రో' సినిమా ఓటిటి రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం రైట్స్‌ను సొంతం చేసుకుంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Suriya, Karthik Subbaraj, Retro , OTT


తమిళ  స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తే అది  వర్కవుట్ కాలేదు. ఈ సినిమా సూర్య అభిమానులను పూర్తి స్దాయిలో నిరాశపరిచింది.   ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. క్రిస్మస్‌ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి డీల్ పూర్తయినట్లు సమాచారం.

retro


సూర్య, కార్తీక్‌ సుబ్బరాజ్ ల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు.   ఈ మూవీ సూర్యకు చాలా ముఖ్యం. ఎందుకంటే మూడేళ్లుగా కంగువ కోసం కష్టపడినా అందుకు తగ్గ ఫలితం రాలేదు. రెట్రోపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సూర్య. దాంతో చాలా కసిగా చేస్తున్నాడు.   ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ , ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'రెట్రో' రూపొందుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది. 


retro tamil movie


తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నెట్ ప్లిక్స్ ఈ రెట్రో చిత్రం రైట్స్ ని భారీ రైట్స్ కు తీసుకుంది. అన్ని లాంగ్వేజ్ లు కలిపి 80 పెట్టి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటిటి స్పేస్ లో సూర్యకు ఉన్న క్రేజ్ ఇది నిదర్శనం అని అభిమానులు అంటున్నారు. కంగువ వంటి డిజాస్టర్ వచ్చాక కూడా ఈ స్దాయి రేటు  పలకటం అంటే మాటలు కాదు. 
 


రెట్రో చిత్రంలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... ఆమె పాత్రకు మంచి ప్రాముఖ్యం ఉన్నట్లు అర్థం అవుతోంది.  ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. 
 


 ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ‘రెట్రో’ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక-సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.  

Latest Videos

click me!