తన లవ్ ఎఫైర్ బయట పెట్టిన సురేఖ వాణి కూతురు.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 21, 2022, 09:36 AM IST

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

PREV
16
తన లవ్ ఎఫైర్ బయట పెట్టిన సురేఖ వాణి కూతురు.. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. 

26

అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు. ఎవరైనా ఆకతాయిలు అతిగా ప్రవర్తించినపుడు మాత్రం ఘాటుగా బదులిస్తారు. 

36

సురేఖ వాణి, సుప్రీత ఇద్దరూ పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తున్నారు. తాజాగా సుప్రీతా నెటిజన్లకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. 'అతడి ప్రేమకు నేను ఒకే చెప్పాను' అంటూ తన ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్ షేర్ చేసింది. 

46

ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుప్రీతా ప్రియుడి పేరు రాకీ జోర్డాన్. అతడు ర్యాపర్ గా, నటుడిగా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో సుప్రీత ప్రేమకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

 

56

సురేఖ వాణి, సుప్రీతకు సోషల్ మీడియాలో మాములు క్రేజ్ లేదు. సురేఖ వాణిని ఇంస్టాగ్రామ్ లో 5 లక్షల 61 వేలమంది ఫాలో అవుతున్నారు. ఇక సుప్రీతని 5 లక్షల 20 వేలమంది ఫాలో అవుతున్నారు. 

 

66

సుప్రీత టీనేజ్ వయసులోనే గ్లామర్ తో ఆకట్టుకుంటుండగా.. సురేఖ వాణి వయసు పెరుగుతున్నప్పటికీ అదే ఫిజిక్, అందం మైంటైన్ చేస్తోంది. 

 

click me!

Recommended Stories