టాలీవుడ్ నటిగా గుర్తింపు..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'బొమ్మరిల్లు', 'రెడీ', 'దుబాయ్ శీను' వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించిన ప్రముఖ నటి సురేఖా వాణి. తెరపై సాంప్రదాయమైన వదిన, అక్క లేదా అమ్మ పాత్రల్లో అలరించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతో ట్రెండీగా, మోడ్రన్‌గా ఉంటూ సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆమెకు సంబంధించి వైరల్ అవుతున్న పోస్టులు, వార్తలపై అనేక చర్చలు నడుస్తున్నాయి.
తనకంటే చిన్నవాడితో సురేఖ ప్రేమ..?
రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో సురేఖ తనకంటే చిన్నవాడిలా కనిపిస్తున్న యువకుడితో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించింది. అయితే ఈ పోస్ట్ ను సురేఖ వాణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆతర్వాత డిలెట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఆమె అతనితో డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటుందని అంటున్నారు. ఈ విషయంపై సురేఖ వాణి స్పందించింది. పోస్ట్ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ... సోషల్ మీడియా జనాలకు మాత్రం ఓ వార్నింగ్ ఇచ్చింది.