టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖ వాణి ఒకరు. చాలా ఏళ్లుగా సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం సురేఖ వాణికి అవకాశాలు బాగా తగ్గాయి. గత ఏడాది సురేఖ వాణి హనీమూన్ ఎక్స్ ప్రెస్, పారిజాత పర్వం లాంటి చిత్రాల్లో నటించింది. సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతని కూడా ఇండస్ట్రీలో నటిని చేసే ప్రయత్నాలో ఉన్నారు.