Supritha: ఆఫర్‌ ఉంది రమ్మని హ్యాండిస్తారు, ఆ పిచ్చి వదలరా.. సురేఖ వాణి కూతురు సుప్రీత బోల్డ్ కామెంట్స్

Published : Feb 18, 2026, 08:59 AM IST

సురేఖ వాణి కూతురు సుప్రీత తెలుగు హీరోయిన్లకి ఆఫర్లు విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు రావడం లేదని, భాష రాని, భావం రాని ఇతర భాషల అమ్మాయిలకే ప్రయారిటీ ఇస్తున్నారని తెలిపింది. 

PREV
15
ముంబయి హీరోయిన్లకే ఆఫర్లు, తెలుగమ్మాయిలపై చిన్న చూపు

సినిమాల్లో తెలుగు హీరోయిన్ల విషయంలో ఒక వివక్ష ఉంటుంది. తెలుగు హీరోయిన్లని కాకుండా ఇతర భాషాల హీరోయిన్లని ఎంకరేజ్‌ చేయడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. దీంతో మన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. చిన్న చిన్న సినిమాలు, చిన్న పాత్రలకే పరిమితమవుతున్నారు. అదే కన్నడ హీరోయిన్లు, ముంబయి హీరోయిన్లకి మాత్రం భారీ ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్లకే అవకాశాలిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో చాలా మంది తెలుగు హీరోయిన్లు బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఈషా రెబ్బ తన వాయిస్‌ని బలంగా వినిపించింది. ఇప్పుడు సుప్రీత తన వాయిస్‌ ని వినిపించింది.

25
సురేఖ వాణి కూతురు అని ఆఫర్లు ఇవ్వడం లేదు

సీనియర్‌ నటి సురేఖ వాణి కూతురు సైతం తన ఆవేదనని ఓపెన్‌గా వెల్లడించింది. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆఫర్లు ఇస్తామని పిలిచి హ్యాండిస్తారని తెలిపింది. సురేఖ వాణి కూతురు అని ఏ అవకాశం నాకు రాలేదు. నన్ను నమ్మే ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాలు కూడా నన్ను నమ్మి వచ్చిన అవకాశాలే. ప్రతిచోట నెపోటిజం పనిచేయదు. తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావాలని చెబుతున్నారు, కానీ అవకాశాలు ఇవ్వడం లేదు. నెగటివిటీ ఉందని, సురేఖ వాణి కూతురు అని, అసలే ఆఫర్లు ఇవ్వడం లేదు` అని వాపోయింది సుప్రీత.

35
సోషల్‌ మీడియాలో చూశామని చెప్పి ఆఫర్లు ఇవ్వడ లేదు

ఇతర భాషల(కన్నడ, ముంబయి) హీరోయిన్లకి ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పింది. `కొంత మందికి లాంగ్వేజ్‌ రాదు, మరికొంత మందికి యాక్టింగే రాదు, వాళ్లని తెచ్చిపెట్టుకుంటున్నారు. అదే మాకు ఛాన్స్ లు ఇవ్వాల్సి వస్తే, `ఈ అమ్మాయిని సోషల్‌ మీడియాలో చూశాం, టీవీలో చూశారు కదా, మళ్లీ థియేటర్లో ఏం చూస్తారులే అని వద్దు అని చెప్పిన మాటలు నేనే విన్నాను` అని తెలిపారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు సుప్రీత.

45
అమ్మ ఎప్పుడూ నాకు ఆఫర్‌ ఇవ్వమని అడగలేదు

మరో ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ముంబయి నుంచి వాళ్లని తీసుకొస్తారు, వాళ్లకి భాష రాదు, యాక్టింగ్‌ రాదు, భావం రాదు, కేవలం గ్లామర్‌ ఉంటే సరిపోతుందా? మాకు అన్ని ఉన్నా కూడా ఆఫర్లు ఇస్తామని పిలిచి తీరా వెళ్లాక మొండి చేయి చూపిస్తున్నారు. ఇకనైనా ఈ ముంబయి పిచ్చి పక్కన పెట్టి, తెలుగు అమ్మాయిలకు ఆఫర్లు ఇవ్వండి` అని సుప్రీత తెలిపారు. అమ్మకి నేమ్, మంచి పరిచయాలు ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ ఆఫర్ ఇవ్వమని అడగలేదని, నేను ఆఫర్లు సంపాదించుకోవాలని అనుకుంటుందని తెలిపారు. సుప్రీత కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

55
అమరావతికి ఆహ్వానంలో మెరిసిన సుప్రీత

సుప్రీత ఇటీవల `అమరావతికి ఆహ్వానం` అనే చిత్రంలో నటించింది. హీరోయిన్‌ తరహా పాత్ర అది. నటిగా మెప్పించింది సుప్రీత. కానీ ఈ మూవీ థియేటర్లోకి వచ్చిందనే విషయమే తెలియకుండా పోయింది. దీంతో ఇది ఆమెకి పెద్దగా ప్లస్‌ కాలేకపోయింది. ఇప్పుడు తమిళంలో ఓ మూవీ, తెలుగులో ఇంకో మూవీ చేస్తున్నట్టు తెలిపింది సుప్రీత. తనకు నటనకు ప్రయారిటీ ఉన్న పాత్రలు, ఇంపాక్ట్ ఉన్న పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కథ, పాత్ర డిమాండ్‌ చేస్తే అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధమే అని తెలిపింది సుప్రీత.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories