రంగురంగుల లెహంగాలో శ్రీముఖి మెరుపులు.. చిట్టి నడుమును చూపిస్తూ స్టార్ యాంకర్ అదిరేటి ఫోజులు..

First Published | Apr 5, 2023, 6:41 PM IST

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi) సోషల్ మీడియాలో ఎంత  యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  అదిరిపోయే పోస్టులతో తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటోంది. తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసి కట్టిపడేస్టోంది. 
 

‘పటాస్’తో బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి మంచి గుర్తింపు దక్కించుకుంది. చలాకీ మాటలతో, చురుకుదనంతో  బుల్లితెర ఆడియెన్స్ ను ఎప్పుడో ఆకట్టుకుంటుంది. యాంకర్ గా తనదైన  శైలిలో మెప్పించింది. 
 

శ్రీముఖి శైలికి ఫ్యాన్స్ ఫిదా  అయ్యారు. ఆమె అందానికి సైతం  మంత్రముగ్ధులయ్యారు.  దీంతో బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి బిరుదు కూడా ఇచ్చారు. ఫలితంగా స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖికి క్రేజ్ అంతకంతకూ పెరిగిపోయింది. 
 


ప్రస్తుతం శ్రీముఖికి బుల్లితెరపై ఎలాంటి ఢోకా లేదు. బ్యాక్ టు బ్యాక్ కొత్త షోలతో అదరగొడుతోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. దాంతో శ్రీముఖిని అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.  
 

సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎంత  యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన అభిమానుల కోసం అదిరిపోయే పోస్టులు  పెడుతూ ఉంటుంది. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే, తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల కోసం అదిరిపోయే లుక్  లో ఫొటోషూట్లు చేస్తుంటారు. 
 

ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేస్తుంటారు. నయా  లుక్స్ లో దర్శనమిస్తూ మైమరిపిస్తుంటుంది.  ఈ క్రమంలో శ్రీముఖి  లేటెస్ట్ ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది.  లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేసింది.
 

రంగురంగుల లెహంగాలో శ్రీముఖి అందంగా మెరిసింది. లెహంగా వోణీలో, మ్యాజింగ్ బ్లౌజ్ లో మైమరిపించింది. మెడలో అట్రాక్టివ్ నెక్లెస్ ధరించి ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తనదైన పోజులతోనూ ఆకట్టుకుంది.

ఇటీవల గ్లామర్ విందు కూడా  చేస్తున్న శ్రీముఖి ఎలాంటి  అవుట్ ఫిట్స్ లలోనైనా కట్టిపడేస్తోంది. తన అందంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మైమరిపిస్తోంది.  లేటెస్ట్ షూట్ లో చిట్టి నడుమును చూపిస్తూ, మత్తెక్కించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో శ్రీముఖిని పొగుడుతున్నారు.  
 

బుల్లితెరపై సందడి చేస్తున్న శ్రీముఖి అటు వెండితెరపైనా ఆయా పాత్రల్లో మెరుస్తూనే ఉంది. గతంలో ‘క్రేజీ అంకుల్స్’, ‘మ్యాస్ట్రో’ చిత్రాల్లో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

Latest Videos

click me!