సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి మహేష్ బాబు

First Published | Nov 16, 2024, 7:59 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ట్రూజన్ సోలార్‌తో కలిసి సౌరశక్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం.


సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు దేశంలోని పలు పెద్ద బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే  ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్రెసెస్‌లో పార్ట్‌న‌ర్ అయిన మ‌హేశ్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌తో నిర్మాత‌గా కూడా మారిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ఈయ‌న మ‌రో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌నే వార్త వినబడుతోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌హేశ్  సోలార్ బిజినెస్ ఎంటర్ అవుతున్నార‌ని వినికిడి. 


వివరాల్లోకి వెళ్తే..  మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్‌టెక్ లిమిటెడ్)తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. దాంతో ఆయన అభిమానులు గ్రీన్ ఎనర్జీ కి 'సూపర్' ఎనర్జీ తోడైతే ఇండియా లో సోలార్ పవర్ కి తిరుగుండదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
 


మహేష్ , రాజమౌళి చిత్రం విషయానికి వస్తే...:  ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.   ప్రస్తుతం హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు మహేష్ బాబు. రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. లాంగ్ హెయిర్.. మీడియం గెడ్డంతో.. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా తయారయ్యాడు. త్వరతో ఈమూవీ ఓపెనింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.

 ఈసినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. అమెజాన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈసినిమ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.  

మ‌హేశ్, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రానున్న మూవీ బ‌డ్జెట్ ఖ‌చ్చితంగా రూ.1000 కోట్లు దాట‌వ‌చ్చున‌ని సమాచారం. ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు న‌టించ‌నున్న‌ారు. ఇక ఈ చిత్ర బిజినెస్ రూ.2000 కోట్లు దాటొచ్చున‌ని టీమ్ భావిస్తోంది. 


ఇప్పటికే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఫుల్ గా జుట్టు, గడ్డం పెంచేసి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొన్ని ట్రైనింగ్స్ కూడా తీసుకున్నాడు మహేష్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో రాజమౌళి లొకేషన్స్ వేటలో పడ్డాడు.

ఈ సినిమా అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అని, అడవుల నేపథ్యంలో ఉంటుందని, ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో రాజమౌళి కూడా చెప్పాడు. తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కెన్యాలోని ఓ అడవి ప్రాంతంలో జంతువుల మధ్య తిరుగుతున్న ఫోటోని షేర్ చేసి.. వెతుకుతున్నాను అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Mahesh Babu, krishna,


ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం మ‌హేశ్ బాబు ఇప్ప‌టికే లాంగ్ హెయిర్‌, గుబురు గ‌డ్డంతో ఎంతో స్టైలిష్ గా మారారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  

రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. అయితే అధికారికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాని ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Latest Videos

click me!