ఇక త్రివిక్రమ్ నాకు మూడు హ్యాట్రిక్ విజయాలు ఇచ్చాడు. నేను కెరీర్లో ఎదగడానికి వీరందరి సహకారం ఉందని, అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప 3 చేసే ఆలోచన ఉందా అని అడగ్గా.. అమ్మో అని భయపడ్డారు అల్లు అర్జున్. రాబోయే రెండేళ్లలో కనీసం మూడు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నానని అన్నాడు.
ఇక పుష్ప 2 వేల థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. సినిమాకు ఉన్న డిమాండ్ రీత్యా పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పుష్ప 2తో అల్లు అర్జున్ రూ. 1000 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.