Ramesh Babu : మహేష్ సోదరుడు రమేష్ బాబుకు ఎంత మంది పిల్లలు..? ఆయన భార్య ఎవరో తెలుసా..?

Published : Jan 09, 2022, 09:59 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు(Mahesh Babu).. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు (Ramesh Babu)మరణించారు. కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన.. హస్పిటల్ కు తీసుకెళ్తుండగా మరణించారు. రమేష్ బాబు కు ఎంత మంది పిల్లలు.. ఆయన ఫ్యామిలీ ఎక్కువగా ఎందుకు కనిపించరు.

PREV
14
Ramesh Babu : మహేష్ సోదరుడు రమేష్ బాబుకు ఎంత మంది పిల్లలు..? ఆయన భార్య ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు.. కృష్ణ(Krishna)  పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు సడెన్ గా మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిన్న రాత్రి సీరియస్ అవ్వడంతో.. హస్పిటల్ కు తరలించే లోపే మరణించారు. కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన రమేష్ బాబు హీరోగా నిలబడలేక పోయారు. తరువాత ప్రోడ్యూసర్ గా మారి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు నిర్మించారు.

24

ఇక రమేష్ బాబు(Ramesh Babu) ఫ్యామిలీ గురించి చూస్తే.. సూపర్ స్టార్ కృష్ణ -ఇందిరా దేవి ఐదుగురు సంతానంలో రమేష్ బాబు పెద్దవాడు. ఆయన తరువాత మంజుల, పద్మావతి, మహేష్ బాబు ప్రియదర్శిని ఉన్నారు.మహేష్ బాబు కంటే ముందే అల్లూరి సీతారామరాజు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. ఆతరువాత హీరోగా మారారు. కాని సొంతగా ఇమేజ్ సాధించలేక పోయారు. 1997 లో వచ్చిన ఎన్ కౌంటర్ తరువాత ఆయన వెండి తెరకు దూరం అయ్యారు.

34

మహేష్ బాబు ఫ్యామిలీ...ఆయన అక్కలు.. చెల్లెలు అందరూ ఏదో ఒక సందర్భంలో కనిపిస్తారు కాని.. రమేష్ బాబు(Ramesh Babu) ఫ్యామిలీ మాత్రం ఎక్కువగా బయట కనిపించరు. రమేష్ బాబు భర్య పేరు మృదుల, వీరికి ఇద్దరు పిల్లలు.  అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ,  వీరు బయట పెద్దగా కనిపించరు. ఎక్కువగా మీడియా ముందుక కూడా రారు. ఘట్టమనేని  ప్యామిలీ ఫంక్షన్స్ తో కూడా వీరు కనిపించింది తక్కువే.

 

44

రమేష్ బాబు(Ramesh Babu) కూడా సినిమాలకు దూరం అయిన తరువాత బాగా వ్యసనాలకు అలవాటు పడిపోయినట్టు సమాచారం. అందకే ఆయన కూడా ఎక్కువగా బయట కనిపించలేదు. ఎప్పుడో ఆయన కుమారుడు జయ కృష్ణ ధోతీ ఫంక్షన్ లో తప్పించి.. రమేష్ బాబు బయటకు వచ్చిన సందర్భాలు లేవు. క్రమంగా ఆయన ఆరోగ్యం కూడా క్షీనించడంతో.. రమేష్ బాబు బయట కనిపించడం మానేశారు. సమస్య తీవ్రంగా మారడంతో నిన్న రాత్రి (జనవరి 8) ఆయన మరణించారు.  

click me!

Recommended Stories