అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం, పైగా రాజమౌళి దర్శకత్వం అంటే యాక్షన్ స్టంట్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మహేష్ బాబు దాదాపుగా అన్ని చిత్రాలు వీలైనంత వరకు రియల్ స్టంట్స్ చేస్తుంటారు. మహేష్ బాబు రియల్ స్టంట్స్ చేస్తుంటే సూపర్ స్టార్ కృష్ణ తండ్రిగా చాలా భయపడేవారట. టక్కరి దొంగ చిత్రంలో మహేష్ బాబు ట్రైన్ లో వేలాడడం, బ్రిడ్జ్ పై వేలాడడం లాంటివి రియల్ గా చేశారట. ఎంత వద్దని చెప్పినా మహేష్ బాబు వినలేదని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.