వీళ్ళిద్దరికి ఆన్ స్క్రీన్ పెళ్ళి చేశారు. డ్యూయోట్లు వేశారు, పెళ్ళి చూపులు చేశారు. లవ్ ఫెయిల్యూర్ ఎపిసోడ్లు కూడా చేశారు. రష్మీ-సుధీర్ ల మధ్య ఏం ఉంది ఏం లేదు అనేది తెలియదు కాని.. వీరిమధ్య ప్రేమ అనే టైటిల్ కార్డ్ ఇచ్చి ఎంత వాడాలో అంత వాడేశారు. ఇక రష్మీ-సుధీర్ జోడీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వీరి ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదరు చూసేజనాలు బోలెడు మంది. ఇక ఇలాంటివి నచ్చక వీరిని ప్రత్యేకంగా విమర్శించే బ్యాచ్ కూడా ఉన్నారు.