కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరికీ సంక్రాంతి రోజున కోలుకోలేని దెబ్బ, టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్రం

Published : Mar 02, 2025, 03:14 PM IST

ఒకే రోజు రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలైన అరుదైన సంఘటన టాలీవుడ్ లో జరిగింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
16
కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరికీ సంక్రాంతి రోజున కోలుకోలేని దెబ్బ, టాలీవుడ్ చరిత్రలో కనీవినీ ఎరుగని విచిత్రం
SuperStar Krishna, Krishnam Raju

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు తెరకెకెక్కడమే చాలా కష్టం అవుతోంది. వెంకటేష్ లాంటి హీరోలు అప్పుడప్పుడూ మల్టీస్టారర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. అయితే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలు ఎన్నో అద్భుతమైన మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. 

26
SuperStar Krishna

ఒకే రోజు రెండు భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలైన అరుదైన సంఘటన టాలీవుడ్ లో జరిగింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1984లో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు 'యుద్ధం' అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటించారు. ఈ మూవీలో ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉన్నారు. దర్శకుడు తక్కువోడేం కాదు.. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

36
SuperStar Krishna

ఈ చిత్రంలో కృష్ణకి హీరోయిన్ గా జయప్రద.. కృష్ణంరాజుకి హీరోయిన్ గా జయసుధ నటించారు. కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్స్ లో నటించడం విశేషం. తండ్రులపాత్రలకు హీరోయిన్లుగా సుజాత, రాధికా నటించారు. అప్పట్లో యుద్ధం చిత్రం అత్యంత భారీ బడ్జెట్ లో రూపొందింది. అయితే తండ్రి పాత్రల్లో కృష్ణంరాజు కుంటివాడిగా, కృష్ణ గుడ్డివాడిగా నటించడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. 

46
SuperStar Krishna

1984 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రాన్ని దారుణమైన దెబ్బ కొట్టిన అంశాల్లో కథ మాత్రమే కాదు మరొకటి కూడా ఉంది. అదేంటంటే ఈ మూవీ విడుదలైన రోజునే మరో భారీ మల్టీస్టారర్ చిత్రం కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ టైటిల్ ఇద్దరు దొంగలు. ఈ చిత్రంలో హీరోలుగా సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు నటించారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

56

వాస్తవానికి ఈ చిత్రాన్ని యుద్ధం కంటే ముందుగానే 1983 దసరాకి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ చివరి షెడ్యూల్ షూటింగ్ సమయంలో రాఘవేంద్ర రావు అనారోగ్యానికి గురయ్యారు. దీనితో షూటింగ్ ఆలస్యం జరిగింది. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చిత్రానికి పోటీగా ఇద్దరు దొంగలు చిత్రాన్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంలో రాధా, జయసుధ హీరోయిన్లుగా నటించారు. 

66
krishna,krishnam raju

ఇద్దరు దొంగలు చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనితో యుద్ధం చిత్రానికి రావలసిన ఓపెనింగ్స్ ఈ మూవీవైపు మళ్ళాయి. ఫలితంగా దాసరి చిత్రానికి కోలుకోలేని దెబ్బ పడింది. ఈ రెండు చిత్రాల్లో కామన్ గా నటించిన హీరో కృష్ణ కావడం విశేషం.  

Read more Photos on
click me!

Recommended Stories