సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ స్థాయి చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో శ్రీమంతుడు ఒకటి.
ఈ చిత్రంలో మహేష్ బాబు వాడిన సైకిల్ బాగా హైలైట్ అయింది. అప్పట్లో యువత కూడా మహేష్ లాగా సైకిల్ ఉపయోగించారు.అదొక ట్రెండ్ గా మారింది. ఏకంగా 3.5 లక్షల విలువైన సైకిల్ ని మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం కోసం ఉపయోగించారు. అంత కాస్ట్లీ సైకిల్ వాడడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
శ్రీమంతుడు చిత్రం విజయం సాధించాక మహేష్ బాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి మహేష్ బాబు ఫన్నీ కౌంటర్ ఇచ్చారు. ఈ చిత్రంలో మీరు వాడిన సైకిల్ బాగా హైలైట్ అయింది. సైకిల్ రైడింగ్ చాలా మంచిది. ఇకపై మీరు సైకిల్ ఉపయోగించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
దీనికి మహేష్ సమాధానం ఇస్తూ.. సైకిల్ లో వెళితే ఎక్కడికి వెళ్లాలన్నా సాయంత్రం వరకు తొక్కుతూనే ఉండాలి.. సైకిల్ లో ఎందుకు వెళతాం చెప్పండి.. సార్ సినిమా చేశాం కదా అని రోడ్లపై నేను సైకిల్ తొక్కితే జనాలు నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు. కారులోనే వెళతా అంటూ మహేష్ సెటైర్ వేశారు. మహేష్ బాబు సెటైర్ కి , కామెడీ టైమింగ్ కి అంతా పగలబడి నవ్వారు.