Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ హెచ్చరించినా వినకుండా ఓ దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేశారు. కృష్ణ మాట విని ఉంటే ఆ దర్శకుడికి కోట్ల ఆదాయం వచ్చేది. కానీ ఆయన మాట పెడచెవిన పెట్టడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది.
సూపర్ స్టార్ కృష్ణ చిన్నతనం నుంచే మహేష్ బాబుకి సినిమాలు అలవాటు చేశారు. అందుకే మహేష్ బాల్యం నుంచే నటుడిగా రాణించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మహేష్ బాబు సోలో హీరోగా రాజకుమారుడు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే మహేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ హీరోగా మారిపోయారు.
DID YOU KNOW ?
మోసగాళ్లకు మోసగాడు మూవీ బడ్జెట్
సూపర్ స్టార్ కృష్ణ 1971లో నటించిన కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు 7 లక్షల బడ్జెట్ తో తెరకెక్కింది. అప్పట్లో అదే టాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ.
25
టక్కరి దొంగ మూవీ
మహేష్ బాబు అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయంలో జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో నటించారు. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించిన జయంత్ సి పరాన్జీ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక చిత్రం వచ్చింది. తాను కోరుకున్న విధంగా మహేష్ తో చిత్రాన్ని జయంత్ రూపొందించారు. కానీ ఆ చిత్రంతో జయంత్ సి పరాన్జీ కోలుకోలేని దెబ్బ తిన్నారు. ఆ చిత్రం ఇంకేదో కాదు.. టక్కరి దొంగ. ఈ మూవీలో మహేష్ బాబు కౌబాయ్ గా అదరగొట్టాడు. కానీ సినిమా వర్కౌట్ కాలేదు. టక్కరి దొంగ చిత్రానికి దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే.
35
సూపర్ స్టార్ కృష్ణ వద్దన్నారు
ఈ చిత్ర సంగతులు పంచుకుంటూ జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుతో తాను సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్పాను. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తున్నాని చెప్పాను. కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మూవీ నాకు చాలా ఇష్టం. అదే విధంగా మహేష్ బాబుని కూడా కౌబాయ్ గా చూపించాలని అనుకున్నా. టక్కరి దొంగ కథ చెప్పగానే కృష్ణ గారు ఈ చిత్రం వద్దు అని అన్నారు.
ఆయన నాతో ఏం చెప్పారంటే..నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ మూవీకి నువ్వే నిర్మాతని అని అంటున్నావ్. మంచి లవ్ స్టోరీ తీస్తే కోట్లు సంపాదించుకోవచ్చు కదా. కౌబాయ్ చిత్రానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. రిస్క్ ఎక్కువ అని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన మాట వినకుండా భారీ బడ్జెట్ లో టక్కరి దొంగ చిత్రాన్ని రూపొందించాను. ఆ చిత్రం ఏమాత్రం వర్కౌట్ కాలేదు.
55
టక్కరి దొంగతో కోలుకోలేని దెబ్బ
నాకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పుల పాలయ్యాను. ఆ అప్పులు తీర్చడానికి నాకు మూడు సినిమాల టైం పట్టింది. ఈశ్వర్, శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మీ నరసింహా చిత్రాలకు నాకు వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోయింది. నాకంటూ ఏమీ మిగల్లేదు అని జయంత్ సి పరాన్జీ అన్నారు. కానీ మహేష్ బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. టక్కరి దొంగ చిత్రం ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని జయంత్ తెలిపారు.