జీవితంలో అలాంటి సినిమా చేయనని తేల్చేసిన సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున వల్లే పెద్ద రచ్చ, ఏం జరిగింది ?

Published : Mar 09, 2025, 01:28 PM IST

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలో కూడా కృష్ణ కొన్ని క్రేజీ కాంబినేషన్ ఉన్న చిత్రాల్లో నటించారు. 

PREV
15
జీవితంలో అలాంటి సినిమా చేయనని తేల్చేసిన సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున వల్లే పెద్ద రచ్చ, ఏం జరిగింది ?
Nagarjuna and Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలో కూడా కృష్ణ కొన్ని క్రేజీ కాంబినేషన్ ఉన్న చిత్రాల్లో నటించారు. అలా కృష్ణ, నాగార్జున క్రేజీ కాంబినేషన్ లో వారసుడు అనే చిత్రం తెరకెక్కింది. ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. మురళీ మోహన్ జయభేరి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. 

 

25
Varasudu Movie

ఈ చిత్రంలో కృష్ణ.. నాగార్జునకి తండ్రిగా నటించారు. మొదట కృష్ణ ఈ పాత్రలో అంగీకరించలేదు. తండ్రి పాత్రని బ్రదర్ పాత్రగా మార్చండి అప్పుడు చేస్తాను అని చెప్పారట. అలా మారిస్తే కథ మొత్తం మార్చాల్సి ఉంటుంది అని దర్శకుడు ఇవివి సత్యనారాయణ మరికొందరు నటుల్ని ట్రై చేశారు. కానీ కుదర్లేదు. ఈసారి మురళి మోహన్ స్వయంగా కృష్ణ వద్దకి వెళ్లి రిక్వస్ట్ చేశారు. 

 

35
Varasudu Movie

కృష్ణ పాత్రలో చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ కథ వినిపించారు. అప్పుడు కృష్ణ ఈ చిత్రానికి అంగీకరించడం జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున కృష్ణ కొడుకుగా, కాలేజీ స్టూడెంట్ గా నటించారు. తండ్రి అంటే అసహ్యించుకునే పాత్ర నాగార్జునది. ఈవీవీ సత్యనారాయణ మార్క్ కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అంశాలతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

 

45
Nagarjuna Akkineni

కానీ క్లైమాక్స్ సన్నివేశాలు చిత్ర యూనిట్ కి తలనొప్పి తెచ్చిపెట్టాయి. క్లైమాక్స్ లో నాగార్జున.. కృష్ణని తిడుతూ కాలర్ పట్టుకునే సన్నివేశం ఉంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ అభిమానులు థియేటర్స్ వద్ద గొడవ చేశారు. కృష్ణని కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించాలని లేకుంటే వారసుడు మూవీ ప్రదర్శనలు అడ్డుకుంటాం అని తేల్చి చెప్పారు. 

 

55

దీనితో స్వయంగా నాగార్జున, ఈవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగి క్షమాపణ చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ అంటే అపారమైన గౌరవం ఉందని, ఆ సన్నివేశం వల్ల ఇంత హంగామా అవుతుందని ఊహించలేదని చెప్పారు. దీనితో ప్రింట్స్ మొత్తం వెనక్కి తెప్పించి క్లైమాక్స్ ని రీ షూట్ చేసి మళ్ళీ విడుదల చేశారు. తొలి వారమే కోటి రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం 100 రోజుల వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. తాను అంతగా ప్రాధాన్యత లేని పాత్రల్లో నటిస్తే ఏమవుతుందో ఊహించిన కృష్ణ.. ఇకపై ఇలాంటి చిత్రాల్లో నటించనని తేల్చి చెప్పేశారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories