Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..

Published : Jun 14, 2026, 09:45 AM IST

నటుడిగానే కాకుండా, 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై నిర్మాతగానూ నాని డిఫరెంట్ కథలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ హీరోయిన్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. 

PREV
16
కన్నడ బ్యూటీకి నాని ఛాన్స్..
టాలీవుడ్ 'న్యాచురల్ స్టార్' నానికి కన్నడ హీరోయిన్లంటే స్పెషల్ ఇంట్రెస్ట్. తన 'హిట్ 3' సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టికి ఛాన్స్ ఇచ్చిన నాని, ఇప్పుడు మరో శాండల్‌వుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను తన ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు.
26
సౌత్ ఇండియా ఫేమస్

'సప్త సాగరాదాచె ఎల్లో' సినిమాతో సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ అయిన రుక్మిణి వసంత్, ఇప్పుడు నాని నిర్మాణంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. ఈ న్యూస్ ఫిలింనగర్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో నటిస్తోంది. 

36
నిర్మాతగా దూసుకుపోతున్న నాని..

నాని తన 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై విభిన్న చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా రాబోతోంది. ఈ కథకు రుక్మిణి వసంత్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని టీమ్ భావించిందట.

46
రుక్మిణి కళ్లకు అభిమానులు ఫిదా..

'సప్త సాగరాదాచె ఎల్లో' సినిమాలో 'ప్రియ' పాత్రతో రుక్మిణి వసంత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె సహజ నటన, కళ్లతో పలికించిన హావభావాలకు అభిమానులు  ఫిదా అయ్యారు. రుక్మిణి ఇప్పటికే తమిళ్‌లో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ ప్రెస్టీజియస్ బ్యానర్‌లో అవకాశం రావడంతో ఆమె కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ కానుంది. కథ వినగానే రుక్మిణి చాలా ఎగ్జైట్ అయి, వెంటనే ఓకే చెప్పిందని సమాచారం.

56
హీరోగా నటించడంలేదు..

ఈ సినిమాలో నాని హీరోగా నటించడం లేదు. కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. గతంలో 'అ!' (Awe), 'హిట్' సిరీస్ లాంటి కొత్త కాన్సెప్ట్‌లను నమ్మి నాని సక్సెస్ కొట్టారు. ఇప్పుడు మురళీకాంత్ దేవసోత్ సినిమాతోనూ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు.

66
రుక్మిణి జోడీగా నటించే హీరో ఎవరు?

హీరోయిన్‌గా రుక్మిణి ఫిక్స్ అయినా, ఆమెకు జోడీగా నటించే హీరో ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తర్వాత, ఇప్పుడు మరో కన్నడ నటి రుక్మిణి వసంత్ నాని బ్యానర్‌లో మెరవబోతుండటం శాండల్‌వుడ్ అభిమానులకు సంతోషాన్నిస్తోంది. రుక్మిణి టాలీవుడ్ జర్నీ సక్సెస్ కావాలని వారు  కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories