లెజెండ్రీ హీరో మూవీలోని సీన్లు పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్..పెద్ద రచ్చ అయింది..

First Published | Sep 13, 2024, 12:51 PM IST

చిత్ర పరిశ్రమలో కథలు, సన్నివేశాల కాపీకి సంబంధించిన వివాదాలు చూస్తూనే ఉన్నాం. గతంలో శ్రీమంతుడు, బలగం లాంటి చిత్రాలకు కాపీ విమర్శలు వచ్చాయి. అదే విధంగా రాజమౌళి కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి ఆ తరహా సన్నివేశాలు పెడుతుంటారనే కామెంట్స్ కూడా వింటూనే ఉన్నాం.

చిత్ర పరిశ్రమలో కథలు, సన్నివేశాల కాపీకి సంబంధించిన వివాదాలు చూస్తూనే ఉన్నాం. గతంలో శ్రీమంతుడు, బలగం లాంటి చిత్రాలకు కాపీ విమర్శలు వచ్చాయి. అదే విధంగా రాజమౌళి కొన్ని హాలీవుడ్ చిత్రాల నుంచి ఇన్స్పైర్ అయి ఆ తరహా సన్నివేశాలు పెడుతుంటారనే కామెంట్స్ కూడా వింటూనే ఉన్నాం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. 

ముఖ్యంగా ఆయన తెరకెక్కిన ఒక బ్లాక్ బస్టర్ మూవీలో కొన్ని సన్నివేశాలు పాత చిత్రంలో నుంచి కాపీ చేయబడ్డాయి అని ప్రచారం జరిగింది. ఆ విమర్శలు ఎదుర్కొన్న చిత్రం మరేదో కాదు.. నితిన్, సమంత నటించిన అ..ఆ.. బావ మరదళ్ల మధ్య రొమాన్స్.. కుటుంబాల మధ్య గొడవలు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బిగినింగ్ లో వచ్చే సన్నివేశాలు దాదాపుగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ చిత్రాన్ని పోలి ఉంటాయి. ఆ చిత్రం పేరు మీనా. 


1973లో కృష్ణ, విజయనిర్మల కలసి జంటగా నటించిన చిత్రం ఇది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ చిత్రానికి విజయనిర్మల దర్శకురాలు. ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా సూపర్ హిట్ అయింది. అయితే విజయనిర్మల ఈ చిత్రాన్ని యద్దనపూడి సులోచనారాణి రచించిన మీనా నవల ఆధారంగా తెరకెక్కించారు. 

మీనా చిత్రంలోని ప్రారంభ సన్నివేశాలని త్రివిక్రమ్ అ..ఆ చిత్రంలో పెట్టారు. ఆ సీన్లు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అ..ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఈ విషయం బయటకి రావడంతో చాలా విమర్శలు వచ్చాయి. మీనా చిత్రానికి గాని, యద్దనపూడి సులోచనారాణికి గాని క్రెడిట్స్ ఇవ్వకుండా సీన్లు వాడుకున్నారని విమర్శించారు. 

ఆ తర్వాత త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కొన్ని సమస్యల వల్ల  సులోచనారాణి పేరు టైటిల్స్ లో వేయలేకపోయాం అని చెప్పారు. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. మీనా చిత్రంలో కృష్ణ.. విజయనిర్మలని ఎత్తుకుని వచ్చి అన్నం తినిపిస్తారు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు అ..ఆ మూవీలో కనిపిస్తాయి. 

విమర్శలు పక్కన పెడితే త్రివిక్రమ్ మాటల పదును మరోసారి చూపించిన చిత్రం అ..ఆ అని చెప్పొచ్చు. మిక్కిజేమేయర్ ఈ చిత్రానికి ఆల్ టైం క్లాసిక్ ఆల్బమ్ ఇచ్చారు. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, రావు రమేష్, అజయ్, నరేష్ నటన ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. 

Latest Videos

click me!