అమితాబ్‌, సన్నీ డియోల్‌, అనుష్క, విద్యా బాలన్‌.. సిగరెట్‌కి దూరంగా ఉన్న బాలీవుడ్‌ స్టార్స్ వీరే

Aithagoni RajuPublished : May 17, 2025 10:05 PM

కొంతమంది బాలీవుడ్ స్టార్స్ వాళ్ళ ఫిట్‌నెస్ కోసం సిగరెట్ లాంటివి దగ్గరికి రానివ్వరు. స్మోకింగ్‌ కి దూరంగా ఉన్న బాలీవుడ్‌ స్టార్స్ ఎవరో తెలుసుకుందాం. 

16
అమితాబ్‌, సన్నీ డియోల్‌,  అనుష్క, విద్యా బాలన్‌.. సిగరెట్‌కి దూరంగా ఉన్న బాలీవుడ్‌ స్టార్స్ వీరే
సన్నీ డియోల్

సన్నీ డియోల్ చాలా ఏళ్ల క్రితమే సిగరెట్ మానేశానని చెప్పారు. ఆయన అడపాదడపా సినిమాల్లో అలాంటి సీన్లు చేస్తున్నారు, తప్పితే రియల్‌ లైఫ్‌లో మళ్లీ సిగరేట్‌ ముట్టుకోలేదు. 

26
అనుష్క శర్మ

ఈ లిస్ట్‌లో అనుష్క శర్మ కూడా ఉన్నారు. ఆవిడ ఇలాంటివన్నీ దూరం పెడతారు. సహజంగా బాలీవుడ్‌ హీరోయిన్లకి కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి. కానీ అనుష్క వాటిని ధరిచేరనివ్వలేదు. 

36
అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తారు. సిగరెట్ దగ్గరికి కూడా తీసుకెళ్లరు. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 

46
జాన్ అబ్రహం

జాన్ అబ్రహం తన ఫిట్‌నెస్‌కి పేరున్నవాడు. సినిమాల్లో నటించడానికే సిగరెట్ తాగుతారు. కానీ రియల్‌ లైఫ్‌లో ఆయన సిగరేట్‌కి దూరంగా ఉన్నారు. 

56
అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ మద్యం, సిగరెట్లకు దూరంగా ఉంటారు. వాటిని ముట్టుకోలేదు కూడా. సినిమాల్లో ఇలాంటి సీన్లు చాలా చేసినా, రియల్‌ లైఫ్‌లో వాటికి ఆస్కారమే లేదు. 

66
విద్యా బాలన్

విద్యా బాలన్` డర్టీ పిక్చర్` సినిమాలో ఒక్కసారి మాత్రమే సిగరెట్ తాగారు. ఆ తర్వాత దానిని ముట్టుకోలేదు. రియల్‌ లైఫ్‌లో వాటికి తను దూరంగా ఉంటుందట. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!