Ooru peru Bhairavakona review
దాదాపు కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ లేదు సందీప్ కిషన్ కు. ఒకటీ రెండు సినిమాలు తప్పించి పెద్దగా హిట్ కొట్టిన సందర్భాలు కూడా లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సందీప్ కు కలిసి రాలేదు. లాస్ట్ టైమ్ బాగా కష్టపడి చేసిన సిక్స్ ఫ్యాక్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఈసారి ఊరిపేరు భైరవకోన సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సందీప్. మరి ఈసారైనా సందీప్ సక్సెస్ సాధించాడా..?
Ooru peru Bhairavakona review
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ జంటగా నటించిన సినిమా ఊరు పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ సుంకర, రాజేశ్ దండ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈమూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమఅభిప్రయాలు వెల్లడిస్తున్నారు.
Ooru peru Bhairavakona review
ఊరు పేరు భైరవకోన సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ బాగుందనే ఎక్కువగా ట్వీట్ చేస్తున్నారు జనాలు. ఫస్టాఫ్ బాగుందంటూనే సెకండాఫ్ కాస్త అటూ ఇటు అయ్యి.. డీసెంట్ గా ఉంది అంటున్నారు. ఇక సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచింది. అంతే కాదు వెన్నెల కిషోర్ కామెడీతో సినిమాను ఇంకాస్త పైకి లేపాడంటున్నారు ఆడియన్స్.
Ooru peru Bhairavakona review
మూవీకి టెక్నిలక్ సపోర్ట్ కూడా బాగా అందిందంటున్నారు. మ్యూజిక్, విజువల్స్ క్వాలిటీగా ఉన్నాయి.. అవి సినిమాను ఇంట్రెస్టింగ్ గామార్చాయన్నారు. సినిమాటో గ్రాఫీ కూడా బాగుందన్నారు. ఇక సీనియర్ దర్శఖుడు దర్శకుడు వీఐ ఆనంద్ వర్క్ అద్భుతంగా ఉంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Ooru peru Bhairavakona review
ఈసినిమాపై మిక్స్ టాక్ వినిపిస్తోంది. సినిమా అంతా బాగుంది కాని.. కొన్ని కొన్ని వదిలేశారంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. కథను కంప్లీట్ చేయలేదని.. సడెన్ గా ముగించారని.. కరెక్ట్ క్లైమాక్స్ ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజన్ ఉంటే.. దానికి సెకండ్ హాఫ్ లో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
Ooru Peru Bhairavakona
ఊరు పేరు భైరవకోన సినిమా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా స్టార్ట్ అయింది. కామెడీ, స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్ కనెక్ట్ ఇంకా బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమా బాగుంది.. సందీప్ ఇంతకు ముందు వచ్చిన సినిమాలకంటే బెటర్.. మరి హిట్ టాక్ తెచ్చకుకుంటుందా... ? లేదా చూడాలి.