ఇక బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈమూవీ కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అలాగే అటు చాలా కాలం తరువాత తమిళంలో ధనుష్, శేఖర్ కముల కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. వీటితో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్.. అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్నారు రష్మిక మందన్నా. ఇవే కాదు యానిమల్ సీక్వెల్ తో పాటు.. ప్రభాస్ సరసన స్పిరిట్ లో కూడా ఈమెనే హీరోయిన్ అంటున్నారు. నిజం ఎంతో తెలియాల్సి ఉంది.