suman, hero suman (photos source rtv interview)
Hero Suman: హీరో సుమన్ ఒకప్పుడు సూపర్ స్టార్‌గా రాణించారు. చిరంజీవి వంటి టాప్ స్టార్స్ కి పోటీ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అంతా సాఫీగా సాగితే ఇప్పుడు మెగాస్టార్ రేంజ్‌లో ఉండాల్సిన హీరో. కానీ కొందరు చేసిన కుట్రలకు తను బలయ్యారు.
దీంతో అటు వ్యక్తిగతంగా, ఇటు కెరీర్ పరంగా డౌన్ అయ్యారు. అయితే బ్లూ ఫిల్మ్ ఆరోపణల కేసులో ఆయన ఏడాది పాటు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనని జైల్లో ఎలా ట్రీట్ చేశారనేది బయటపెట్టాడు సుమన్. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రారంభంలో తన విషయంలో అధికారులు చాలా భయపడ్డారట. తాను ఎక్కడైనా జైల్ అధికారులను ప్రభావితం చేస్తానేమో అని భయపడ్డారట. మొదట ఒక జైల్లో ఉంచి ఆ తర్వాత మార్చారని, పెద్ద అధికారులకు యాక్సెస్ లేకుండా చేశారట.
అయితే జైల్లో మాత్రం తనని చాలా బాగా చూసుకున్నారట. అధికారులతోపాటు ఖైదీలు కూడా ఎంతో బాగా చూసుకున్నారని, తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా డీల్ చేశారని, తోటి ఖైదీలు కూడా ఎంతో బాగా ఉండేవారని తెలిపారు.
Suman
జైల్లో ఉన్నప్పుడు మిగిలిన ఖైదీలతో మాట్లాడినప్పుడు షాకింగ్ విషయాలు, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయని అందులో చాలా మంది ఎలాంటి నేరం చేయకుండానే జైలుకు వచ్చినట్టు తెలిపారు.
జైల్లో ఉన్న వాళ్లంతా తప్పు చేసినవాళ్లు కాదు, వాళ్లల్లో చాలా మంది అమాయకులు ఉన్నట్టు తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో కొందరు తప్పు చేసినవాళ్లు ఉన్నారని తెలిపారు. వారి కథలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని చెప్పారు.