కల్లు దుకాణంలో హత్య, మిస్టరీ ఎలా తేలింది.. ఓటీటీలోకి వచ్చేసిన బసిల్ జోసెఫ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 

Published : Apr 15, 2025, 09:56 PM IST

ఓటీటీలో రిలీజ్ అవుతున్న మలయాళీ చిత్రాలపై తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు మలయాళంలో అద్భుతంగా ఉంటాయి. చిన్న పాయింట్ తో కథ అల్లడం, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు పెట్టి ఆకట్టుకోవడం మలయాళీ దర్శకుల శైలి.

PREV
14
కల్లు దుకాణంలో హత్య, మిస్టరీ ఎలా తేలింది.. ఓటీటీలోకి వచ్చేసిన బసిల్ జోసెఫ్ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 
pravinkoodu shappu

ఓటీటీలో రిలీజ్ అవుతున్న మలయాళీ చిత్రాలపై తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు మలయాళంలో అద్భుతంగా ఉంటాయి. చిన్న పాయింట్ తో కథ అల్లడం, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు పెట్టి ఆకట్టుకోవడం మలయాళీ దర్శకుల శైలి. నటుడు బసిల్ జోసెఫ్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు నెలకొక చిత్రం బసిల్ జోసెఫ్ నుంచి ఓటీటీలో ప్రత్యక్ష మవుతోంది. 

24
Pravinkoodu Shappu ott release

ఇటీవల సూక్ష్మదర్శిని, పొన్ మాన్ లాంటి చిత్రాలు బసిల్ జోసెఫ్ నుంచి అలరించాయి.తాజాగా బసిల్ నుంచి మరో థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఆ థ్రిల్లర్ చిత్రం పేరు 'ప్రవింకూడు షాపు'. ఈ చిత్రంలో బసిల్ పోలీస్ అధికారిగా నటించారు. ఎలాంటి కేసుని అయినా పది రోజుల్లో పరిష్కరించే ప్రతిభ అతడి సొంతం. 

34
Pravinkoodu Shappu

ఒక గ్రామంలో బాబు అనే వ్యక్తి కల్లు దుకాణం నడుపుతుంటారు. ఒక రోజు రాత్రి 11 మంది కల్లు తాగుతూ షాపులోనే తెల్లవారే వరకు ఉండిపోతారు. ఉదయం లేచి చూస్తే షాపు ఓనర్ బాబు చనిపోయి కనిపిస్తాడు. ఈ కేసుని బసిల్ టేకప్ చేస్తాడు. జరిగింది హత్య అని అతడు నిర్ధారిస్తారు. దీనితో షాపులో ఉన్న 11 మందిలోనే హంతకుడు ఉన్నాడని అనుమానిస్తాడు. అసలు బాబుని హత్య చేసింది ఎవరు ? అతడితో ఎవరికి గొడవలు ఉన్నాయి అనేది మిగిలిన కథ. 

44
basil joseph

బసిల్ గత చిత్రాల తరహాలో పోల్చితే ఈ మూవీ అంత గ్రిప్పింగ్ గా ఏమీ లేదు. కాకపోతే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. సోని ఓటిటీలో ఇటీవల ఈ చిత్రం రిలీజ్ అయింది. వెంటనే ఐబొమ్మలో కూడా లీక్ అయింది. థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.  

Read more Photos on
click me!

Recommended Stories