Suma Kanakala : సుమక్కకి కోడలు దొరికినట్టేనా?.. నాగార్జునతో కన్ఫమ్‌ చేసిన స్టార్‌ యాంకర్‌ ?

Published : Dec 17, 2023, 02:51 PM ISTUpdated : Dec 17, 2023, 02:57 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ఈరోజు ప్రసారం కానుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడులైంది. సుమ కనకాల ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

PREV
16
Suma Kanakala : సుమక్కకి కోడలు దొరికినట్టేనా?.. నాగార్జునతో కన్ఫమ్‌ చేసిన స్టార్‌ యాంకర్‌ ?

యాంకర్ కనకాల సుమ (Kankala Suma)  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో పుట్టి పెరిగినా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. టీవీ రంగంలో యాంకర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. చెరగని ముద్ర వేసుకుంది. కేరళ కుట్టి అయినప్పటికీ వ్యాఖ్యతగా తెలుగు ప్రజల్లో కలిసిపోయింది. 

26

ఇప్పటికీ యాంకర్ గా అలరిస్తూనే ఉన్నారు. ఇక నెక్ట్స్ ఆమె కొడుకు రోషన్ కనకాల (Roshan Kanakala)ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తోంది. Bubblegum మూవీతో రోషన్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఆకట్టుకుంటోంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 

36

‘బబ్లూగమ్’ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సుమ, తన కొడుకు, ‘బబ్లూ గమ్’ మూవీ హీరోయిన్ మానస చౌదరి (Manasa Choudhary)  బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ కు హాజరైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో వాళ్లిద్దరితో సమ మెరిసింది. 

46

ఈ సందర్భంగా నాగార్జున - సుమ మధ్య జరిగిన కన్వర్జేషన్ చాలా ఆసక్తికరంగా మారింది. సుమ ఎంట్రీతో నాగ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సమ యాకరింగ్ పైనా ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక హీరోయిన్ మానస గురించి మాట్లాడుతూ.... తెలుగు మాట్లాడుతావా? అని అడుగుతాడు.. అందుకు సుమ ఆసక్తికరంగా బదులిచ్చింది.

56

ఇంకెక్కడి తెలుగు అమ్మాయి సార్.. అయిపోయింది అంటూ హీరోయిన్ గురించి చెప్పుకొచ్చింది. దీంతో పలువురు సుమకు కోడలు దొరికేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సుమ ఆన్సర్ కూ నాగ్ షాక్ అవ్వడం కొసమెరుపు. ఇందిలా ఉంటే.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ఈరోజు జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. 

66

హౌజ్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, యావర్, అమర్ దీప్, ప్రియాంక ఉన్నారు. వీరిలో ఒక్కరే టైటిల్ గెలుచుకోనున్నారు. అతిథులుగా సుమ, రోషన్ కనకాల, రవితేజ, అల్లరి నరేష్, నందమూరి కళ్యాణ్ రామ్, రాజ్ తరుణ్ హాజరయ్యారు. నిధి అగర్వాల్, నేహా శెట్టి స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories