Suma Kanakala: కారులో కూర్చొని బోరున ఏడ్చిన సుమ.. టాప్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్..

Published : Apr 13, 2026, 03:03 PM IST

సుమ కనకాల.. పరిచయం అవసరం లేని పేరు. ఆమె ఎనర్జీ, టైమింగ్ చూస్తే, అలసట అనే మాట ఆమె దగ్గరికి రాదేమో అనిపిస్తుంది. కానీ ఆ చిరునవ్వు వెనుక ఎంత కష్టం, ఒత్తిడి దాగి ఉందో తెలిస్తే మనస్సు చివుక్కుమంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

PREV
15
సుమ కనకాల ఎమోషనల్ కామెంట్స్

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో తన ఎనర్జీ, టైమింగ్, చమత్కారంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ కనకాల. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు సుమ. స్టేజ్ మీద ఆమె ఉత్సాహం, మాటల సరళి చూసి ఆమెకు ఎలాంటి కష్టం ఉండదేమో అనుకుంటారు చాలామంది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఒత్తిడి, అలసట గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 

25
గంటలపాటు షూటింగ్స్

సుమకు ఒక టైంలో చాలా బిజీ షెడ్యూల్స్ ఉండేవట. ఒకే రోజులో పలుచోట్ల షూటింగ్స్, గంటలకొద్దీ నిరంతరంగా నిలబడి మాట్లాడడం, రిహార్సల్స్, లైవ్ ప్రోగ్రామ్స్ వంటివి చేసేవారట. ఒక నెలలో 50 కి పైగా ఎపిసోడ్స్ చేసేవారట. దానివల్ల శరీరమే కాదు.. మనసును కూడా అలసిపోయేదట. కొన్ని రోజులపాటు రాత్రి ఒంటి గంటకు పడుకోవడం తిరిగి 5.30 గంటలకు లేవడం తప్పలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. అంత బిజీ టైంలో కూడా పిల్లలకు కావాల్సినవి చేసిపెట్టడం, షూటింగ్స్ మధ్యలో విరామం దొరికినప్పుడు వారితో ఫోన్లో టచ్ లో ఉండటం చేసేవారట.

35
కారులో కూర్చొని ఏడ్చిన సుమ

ఆ ఇంటర్వ్యూలో సుమ ఒక ప్రత్యేకమైన రోజు గురించి గుర్తుచేసుకున్నారు. ఆ రోజు వరుసగా జరిగిన షూటింగ్స్ వల్ల పూర్తిగా అలసిపోయి, శరీరం సహకరించని స్థితికి చేరుకుందని చెప్పారు. బయటకు మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ తన పని పూర్తి చేసినప్పటికీ, లోపల మాత్రం ఎంతగా అలసిపోయిందో ఎవరికీ తెలియదని అన్నారు. షూటింగ్ తర్వాత కార్లో కూర్చొని బోరున ఏడ్చారట సుమ.

45
అదే సుమ ప్రత్యేకత

అయితే ఎంత అలసిపోయినా, తనకు విశ్రాంతి దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకున్నా చాలు, ఫుల్ రీఛార్జ్ అయిపోతారట సుమ. మళ్లీ షూటింగ్స్ కి హ్యాపీగా వెళ్లిపోతారట. అలా తక్కువ విశ్రాంతితో కూడా తన శరీరం సహకరించడం వరం అని సుమ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

55
నెటిజన్ల కామెంట్స్

సుమ ఇంటర్వ్యూ చూసిన చాలామంది నెటిజన్లు.. “స్క్రీన్‌పై కనిపించే స్మైల్ వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ప్రేక్షకుల కోసం ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే యాంకర్స్, నటులు కూడా మనలాగ సాధారణ మనుషులే. వారికి కూడా అలసట, ఒత్తిడి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ వారి వృత్తి కారణంగా వాటిని బయటపెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని” కామెంట్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories