Top 10 Pan India Stars
ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ తో టాలీవుడ్ దూసుకుపోతోంది. టాలీవుడ్ లోకల్ హీరోలు కాస్తా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోల అవతారం ఎత్తారు. ఇండియా అంతట.. అన్ని భాషల్లో క్రేజ్ ను సాధించారు స్టార్. అంతే కాదు దర్శకులు కూడా పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో చాలామంది స్టార్ హీరోలు.. చాలామంది దర్శకులు కాంబినేషన్లలో సినిమాలు మిస్ అయ్యారట. అందులో సుకుమార్ - పవన్ కళ్యాణ్ కాంబో కూడా ఉంది.
Also Read: రజినీకాంత్ కు రాజమౌళి ఛాలెంజ్, 25 ఏళ్ల తలైవా రికార్డ్ ను బ్రేక్ చేసిన జక్కన్న..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే చాలా మంది దర్శఖులు పోటీపడేవారు. ఒక్క ఛాన్స్ అంటూ స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కట్టేవారు. కాని ఒక టైమ్ లో పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత మందిస సెలబ్రిటీలతో సినిమాలు చేయలేకపోయారు. ఇక ఈ క్రమంలోనే సుకుమార్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమాని చేయడానికి ప్లాన్ చేశాడట.
అంతే కాదు పవన్ స్టార్ కోసం పవర్ ఫుల్ స్టోరీని కూడా రాసుకున్నాడట. కాని పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఆ కథ పవన్ కళ్యాణ్ కోసం మాత్రమే రాసుకోవడంతో.. ఇంకెవరు ఆ పాత్రలో సెట్ అవ్వరని సుకుమార్ ఉద్దేశ్యం. దాంతో ఆయన కోసం రాసిన కథను అలాగే ఉంచాడట సుకుమార్. ఎప్పుడు ఏ ఛాన్స్ వచ్చినా వెంటనే సినిమా చేయాలని అనుకున్నాడట.
Pushpa 2, Sukumar, allu arjun
కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సుకుమార్ కాని.. పవర్ కళ్యాణ్ కాని.. ఈ ఇద్దరికి ఈ సినిమా సాధ్యం కాదు అని చెప్పాలి. ఎందుకంటే సుకుమాన్ పరిస్థితి అందరికి తెలిసిందే. పుష్ప, పుష్ప2 తో ఆయన పాన్ ఇండియా దర్శకుడిగా ఓ రేంజ్ లో ఉన్నాడు.
ఇక ఆయనపై పుష్ప3 బరువు బాధ్యతలు ఉన్నాయి. పుష్ప2 కోసమే మూడేళ్లు తీసుకున్నారు. ఇక పుష్ప3 కోసం ఇంకెన్నేళ్లు పడుతుందో. ఈ లోపు సుకుమార్ సినిమాలు మానేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. పుష్ప2 ప్రభంజనంతో సుకుమార్ కు పనిమరింత పెరిగింది.
ఇక అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ క్రిందట కమిట్ అయని సినిమాలే పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా 3 సినిమాలు ఆయన కోసం వెయిటింగ్. అంతే కాదు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం. దాంతో ఆయనపై చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి.
అయినా సరే ఆమూడు సినిమాలు టైమ్ చూసుకుని పూర్తి చేస్తాను అన్నారు రీసెంట్ గా. ఇక కొత్త సినిమాలు ఒప్పుకోవడం.. అది కూడా సుకుమార్ లాంటి డైరెక్టర్ తో సినిమా అంటే మూడు నాలుగేళ్ళు రాసిచ్చేసేయాలి. పొలిటికల్ గా బిజీ అయిపయిన పవర్ స్టార్.. ఈసినిమాకు టైమ్ ఇచ్చే అవకాశంమే లేదు.
సో ఇందులో నిజమెంతో తెలియదు కాని.. ఒక రకంగా రూమర్ అయినా సరే.. ఒక మంచి కాంబినేషన్ ని ఆడియన్స్ మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదో. వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అయితే కనక ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.