చిరంజీవి, సుహాసిని జోడీ అప్పట్లో అత్యంత విజయవంతమైన జోడీగా రాణించింది. 1980-90లో కలిసి చాలా సినిమాలు చేశారు. అలా `మంచుపల్లకి`, `మగమహారాజు`, `ఛాలెంజ్`, `చట్టబ్బాయి`, `రాక్షసుడు`, `కిరతాకుడు`, `ఆరాధన`, `మరణ మృధంగం` వంటి సినిమాల్లో చిరు, సుహాసిని కలిసి నటించి మెప్పించారు. హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే ఈ ఇద్దరి మధ్య అనుబంధం గొడవలతో ప్రారంభమైందట. తాజాగా ఆ విషయాన్ని సుహాసిని బయటపెట్టింది.
సుహాసిని మొదట్లో సినిమాలకి అస్టిస్టెంట్‌గా పనిచేసింది. ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది. ప్రారంభంలో చిరు `కాళీ` అనే ఓ తమిళ సినిమాలో నటించారు. ఆ మూవీకి సుహాసిని అసిస్టెంట్‌గా పనిచేసింది. సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి కొత్తగా పెళ్లైందట, తమిళం రాకపోవడంతో ఒంటరిగా మూలకు కూర్చున్నాడట. అది చూసిన సుహాసిని అసిస్టెంట్లని అడగ్గా ఆయన తెలుగు హీరో, తమిళం రాదు అని చెప్పారట. దీంతో తనే చిరు వద్దకు వెళ్లి మాట్లాడిందట.
కట్ చేస్తే ఆమె రెండో సినిమా చిరంజీవితో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చింది. అదే `మంచు పల్లకి`. అది చూసి చిరు ఆశ్చర్యపోయారట. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య గొడవైందట. ఆ గొడవేంటో గుర్తు లేదుగానీ, ఈ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువ అనే భావని చిరంజీవిలో ఉండేదన్నారు.
ఆ తర్వాత ఎయిర్ ఇండియా ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కనే వచ్చి కూర్చున్నారట. వచ్చి ఎక్కడ, ఎన్నిరోజులు ఉంటావని అడిగారట. అంతా అయిపోయాక, ఏదైనా అవసరం ఉన్నా, ఏమన్నా కావాలనిపించినా, ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నన్ను అడక్కు అని చెప్పి నిద్ర పోయారట. దీంతో ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఏం హెల్ప్ అడగొద్దు అంటున్నారు, నిద్రపోయారు అని మనసులో అనుకుందని సుహాసిని. ఆయనలాంటి సెన్సాఫ్ హ్యూమర్ ఎవరికీ ఉండదని తెలిపింది సుహాసిని.
ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ఒక తమిళ సినిమాలో సుహాసిని, సుమలత కలిసి పనిచేస్తున్నారట. ఆ సమయంలో `నువ్వు చిరంజీవితో సినిమా చేస్తున్నావట` అని ఆమె సుహాసిని అడిగిందట. అయితేఏంటి? అన్నదట. దీంతో ఆయన తెలుగులో గ్రేట్ అప్‌కమింగ్ స్టార్, మంచి యాక్టర్, తమిళంలో కమల్ హాసన్ ఎలాగో, తెలుగులో ఆయన అలాగా అన్నందట. అంతా విని `అయ్యో చూడ్డానికి విలన్ లా ఉన్నారే` అంటూ కౌంటర్ ఇచ్చిందట సుహాసిని.
అంతేకాదు సుమలత ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పిందట. ఆ నెక్ట్స్ డే షూటింగ్‌కి వచ్చినప్పుడు `విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తారు? విలన్ ఫేస్‌తో ఎవరు యాక్ట్ చేస్తారని గాంభీరంగా మాట్లాడారట. దీంతో ఏంచేయాలో అర్థం కాలేదని, ఎంతో ఆపాలజీ చెప్పినా వినలేదని, బాగా ఆడుకున్నాడని వెల్లడించింది సుహాసిన. అలా గొడవలతో తమ ఫ్రెండిషిప్ ప్రారంభమైందని వెల్లడించింది. అవన్నీ ఇప్పుడు ఎంతో స్వీట్ మెమరీస్‌గా మిగిలాయని వెల్లడిచింది.
చిరంజీవి మంచి మనసు, గొప్పతనం గురించి చెబుతూ, ఇద్దరు కలిసి `మగమహారాజు` చిత్రంలో నటించారు. విజయ బాపినీడు దర్శకుడు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. నెక్ట్స్ మూవీలో రాధికని హీరోయిన్‌గా తీసుకున్నారట. అయితే అదే సమయంలో సుహాసిన ఓ కన్నడ మూవీ చేస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకే చోట జరుగుతున్నాయి. దీంతో చిరంజీవిని చూసి సుహాసిని సెట్‌కి వెళ్లిందట.
ఆ సమయంలో అరే ఈ సినిమాలో ఈ అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు. హీరోయిన్‌ని ఎందుకు మార్చారు అన్నారట. దీంతో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని, ఏం చెప్పాలో అర్థం కాలేదని తెలిపింది సుహాసిని. అయితే `మగమహారాజు` చిత్ర క్లైమాక్స్ లో మూడు రోజులు షూటింగ్‌కి రాలేదు. దీంతో ఆ కోపంతో తనని తీసుకోలేదట. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ బాగా నటిస్తుంది కదా, మూడు రోజులు రాకపోతే టాలెంట్‌ని గుర్తించరా అని చిరంజీవి దర్శకుడిని ప్రశ్నించారట. అంతే నెక్ట్స్ మూవీ `మహారాజు`లో హీరోయిన్‌గా తీసుకున్నారని, అది పెద్ద హిట్ అయ్యిందని, అసలు ఈ విషయం ఆయనకు అవసరం లేదు, కానీ చెప్పడం ఆయన గొప్పమనసు నిదర్శనం అన్నారు చిరంజీవి.
చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకుడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సోషియో ఫాంటసీగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో చిరు రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఇక సుహాసిని చివరగా తెలుగులో `మిస్టర్ ప్రెగ్నెంట్` చిత్రంలో నటించింది.