Writer Padmabhushan Premier Talk: రైటర్ పద్మభూషణమ్ ప్రీమియర్ టాక్  

Published : Feb 01, 2023, 10:14 PM ISTUpdated : Feb 01, 2023, 10:18 PM IST

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శన ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది.   

PREV
17
Writer Padmabhushan Premier Talk: రైటర్ పద్మభూషణమ్ ప్రీమియర్ టాక్  
Writer Padhmabushan Review


కథ:

పద్మభూషణ్(సుహాస్) యంగ్ రైటర్. తన రచనలతో రీడర్స్ ని అలరించి గొప్ప రచయితగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటాడు.ఎంతో కష్టపడి, వ్యయప్రయాసలకోర్చి ఒక బుక్ రాస్తాడు. అది అనుకున్న స్థాయిలో సక్సెస్ కాదు. ఈ ఫెయిల్యూర్ రైటర్ లైఫ్ లోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె రాకతో రైటర్ పద్మభూషణ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకీ పద్మభూషణ్ రైటరేనా? రైటర్ అయితే సక్సెస్ అయ్యాడా? తన పేమకథ ఎలా ముగిసింది? అనేది... రైటర్ పద్మభూషణ్ సినిమా... 
 

27
Writer Padhmabushan Review

విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నాడు నటుడు సుహాస్. ఒకప్పటి ఈ యూట్యూబ్ యాక్టర్ హీరో స్థాయికి ఎదిగాడంటే గొప్ప విషయమే. కలర్ ఫోటో మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ హీరోగా రైటర్ పద్మభూషణ్ మూవీతో మరోసారి తన లక్ పరీక్షించుకుంటున్నారు.
 

37
Writer Padhmabushan Review


రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ ఆసక్తి రేపింది. సుహాస్ చిత్రాల్లో మినిమమ్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రీమియర్ టాక్ ప్రకారం రైటర్ పద్మభూషణ్ మూవీ డీసెంట్ గా ఉంది. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో దర్శకుడు ఒక ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కించారు. 
 

47
Writer Padhmabushan Review


ఫేస్ బుక్, ట్విట్టర్ జనరేషన్ లో బుక్ రీడింగ్ పట్ల జనాలకు ఉండే ఆసక్తి, రైటర్స్ కి ఉండే విలువ సహజంగా చెప్పారు. ఒక ఎమోషనల్ స్టోరీకి లవ్ ట్రాక్ జతచేసి ఎంటర్టైనింగ్ గా నడిపించే ప్రయత్నం చేశారు. సిట్యుయేషనల్ కామెడీ, పంచెస్ అక్కడక్కడా నవ్వు తెప్పిస్తాయి. హీరోయిన్ టీనా శిల్పారాజ్ తో సుహాస్ లవ్ టాక్ బాగుంది. 

57
Writer Padhmabushan Review

ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ తో పాటు ఆద్యంతం రైటర్ పద్మభూషణమ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగుతుందనే ఉత్కంఠ కలిగించగలిగారు. సుహాస్ ఎప్పటిలాగే మిడిల్ క్లాస్ యువకుడిగా నటించి మెప్పించారు. ఆయన నటన చాలా సహజంగా సాగుతుంది. సీనియర్ నటి రోహిణి హీరో తల్లిగా ఆకట్టుకున్నారు. 
 

67
Writer Padhmabushan Review


ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన విలన్ గానే పరిచయం. రైటర్ పద్మభూషణ్ మూవీలో ఒక మంచి తండ్రిగా తనలోని కొత్త కోణం చూపించారు. ప్రధాన పాత్రలు చేసిన సుహాస్, టీనా, రోహిణి, ఆశిష్ విద్యార్థి తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారు. 
 

77
Writer Padhmabushan Review


నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్లేదు. మొత్తంగా రైటర్ పద్మభూషణ్  యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగ్గ ఫీల్ గుడ్ మూవీ. అద్భుతం కాకపోయినా ఒక మంచి మూవీ చూశామన్న భావన ఇస్తుంది. టికెట్ ప్రైస్ కి న్యాయం చేస్తుందని ప్రీమియర్స్ ద్వారా అందుతున్న సమాచారం.  

click me!

Recommended Stories