ఈ చిత్రం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ చెబుతూ, హాలీవుడ్‌లో సూపర్ హిరో సినిమాలు వస్తున్నాయి. మన వద్ద విడుదలై భారీగా కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. అలాంటి సినిమా మనం ఎందుకు తీయకూడదనే ఆలోచనతో `ప్రాజెక్ట్ కే` పుట్టిందని, ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మూవీ అని తెలిపారు. దీనిపై రైటర్ బుర్రా సాయిమాధవ్ చెబుతూ, సినిమా చూస్తే నెల, రెండు నెలల పాటు అదే హ్యాంగోవర్‌లో ఉండిపోతారని, అంతగా హంట్ చేస్తుందని, అసలు అలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయమన్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు చూడనటువంటి కథ అని, ఇలాంటి ఆలోచన, ఈ పాయింట్ ఎవరికీ రాదని, మహా అద్బుతం అని తెలిపారు. ఆ విజువల్స్ కూడా ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరని, కళ్ల సంబురంగా ఉంటుందని, దాన్ని వర్ణించతరం కాదన్నారు. ఇండస్ట్రీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే మూవీ అవుతుందన్నారు. ఇదొక సంచలనం అని చెప్పారు.