దీనికి మించిన మరో కారణం ఉంది. అమ్మాయిలు, ఆడవాళ్లంటే తనకు గౌరవం అని, వారిని తక్కువగా చేసి చూడటం గానీ, వారిని అసభ్యంగా చూడటానికి తాను ఒప్పుకోనని, వాళ్లని గౌరవంగా చూడాలని, తన సినిమాల్లో ఆ రెస్పెక్ట్ ఉండాలని తాను కోరుకుంటానని అందుకే లిప్ లాక్, రొమాన్స్ వంటి అంశాలను తాను దూరం అని ఆయన చెప్పుకొచ్చారు. సుధీర్ నిర్ణయాన్ని, సుధీర్ చెప్పిన కారణానికి అమ్మాయిలంతా ఫిదా అవుతున్నారు. ఇది మహిళల్లో అతనికి మంచి రెస్పెక్ట్ పెంచుతుంది. సుధీర్‌లోని ఆ లక్షణ ఇప్పుడు ఆయన్ని అంతా అభిమానించేలా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.