సుడిగాలి సుధీర్ ఎంత పిసినారో తెలసా? రూపాయి కూడా ఖర్చు పెట్టడా? ఆటో రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్

Published : Feb 24, 2026, 02:48 PM IST

జబర్దస్త్ కమెడియన్ నుంచి టాలీవుడ్ హీరోగా మారిన సుడిగాలి సుధీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన స్నేహితులు ఆటో రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీను. సుధీర్ పిసినారితనం ఎలా చూపిస్తాడంటే?

PREV
14
జబర్దస్త్ వల్ల పాపులర్ అయిన నటులు..

తెలుగు టెలివిజన్ రంగంలో సంచలన సృష్టించిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా చాలామంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు. కొంత మంది హీరోలుగా కూడా మారారు. మరికొంత మంది దర్శకులయ్యారు. కమెడియన్స్ గా కూడా చాలా మంది రాణిస్తున్నారు. జబర్దస్త్ ద్వారా మంచి పోజీషన్ లో ఉన్న వారిలో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ కూడా ఉన్నారు. 

రామ్ ప్రసాద్ సినిమాలు చేస్తూనే.. జబర్దస్త్ ను కంటీన్యూ చేస్తున్నాడు. మరో వైపు సుధీర్ సినిమాలు చేస్తూ.. హీరోగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గెటప్ శ్రీను మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ.. బిజీ అయ్యాడు.

24
ముగ్గరు మిత్రులు ఏం చేస్తున్నారు..

ఇండస్ట్రీ లో ఈ ముగ్గురూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్‌కు దూరమై హీరోగా, యాంకర్‌గా, హీరోగా బిజీగా ఉన్నారు. గెటప్ శ్రీను కూడా షోను వదిలి సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు అందుకుంటున్నారు. రామ్ ప్రసాద్ మాత్రం ఇంకా జబర్దస్త్‌లో కొనసాగుతున్నారు.

 కానీ తన స్నేహితులను రామ్ ప్రసాద్ చాలామిస్ అవుతున్నాడు. ఇద్దరు ఇండస్ట్రీలో బిజీగా ఉండటంతో.. రామ్ ప్రసాద్ మాత్రం అవకాశం వచ్చినప్పుడే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ముగ్గరు స్నేహితులతో సుధీర్ ఒక్కడే పీనాసితనం చూపిస్తాడట. ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేస్తాడట.

34
సుడిగాలి సుధీర్ పీనాసితనం..

ఇటీవల రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి యాంకర్ సుమ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మాట్లాడుతూ, “మా ముగ్గురిలో సుధీర్ పిసినారి. 

ఇప్పటికీ ఫోన్ పే, గూగుల్ పే వాడడు. ఎవరైనా డబ్బుల విషయం గురించి మాట్లాడితే లేదా డబ్బులు అడిగితే మా నాన్నని అడగండి, మా నాన్నతో మాట్లాడండి అని చెప్తాడు. బయటకు వెళ్తే కార్డు వాడతాడు, కానీ మాతో వస్తే అది కూడా తీసుకురాడు” అని అన్నారు.

44
సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ ..

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది నెటిజన్లు సుధీర్ అంత పిసినారా? అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫోన్ పే, గూగుల్ పే కూడా వాడడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ ముగ్గురు తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, వారి స్నేహం, పరస్పర వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories