తల్లి ప్రేమ గురించి తెలిసేలా చేసిన స్కిట్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా అక్కడికి వచ్చిన ఓల్డేజ్ హోమ్ వారికి భాను, వర్ష ఇద్దరూ రూ లక్ష ఆర్థిక సాయం అందించారు. ఇక నటి ఇంద్రజ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలితో మాట్లాడింది. నెలకు వీళ్లకు మెడికల్ ఖర్చులు ఎంత అవుతాయి అని అడిగింది. దీనితో ఆమె లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుందని చెప్పింది. మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి.. ఇక నుంచి ప్రతి నెలా నేను డబ్బు పంపుతాను అంటూ ఇంద్రజ వారికి హామీ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది.