సుధీర్ బాబు ‘మామ మశ్చీంద్ర’ రివ్యూ

Published : Oct 06, 2023, 04:10 PM IST

సుధీర్ బాబు  త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘మామా మశ్చీంద్ర’.  నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకుడుగా మారి చేసిన ఈ సినిమా ఈ రోజు రిలీజైంది. 

PREV
19
 సుధీర్ బాబు  ‘మామ మశ్చీంద్ర’ రివ్యూ
Mama Mascheendra Movie Review

ఈ మధ్యకాలంలో  సుధీర్ బాబు (Sudheer Babu) చేసిన ఏ సినిమాలు ఆడటం లేదు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలని, మేకప్ తో మాయ చేస్తూ చేస్తూ  త్రిపాత్రాభినయంతో మన ముందుకు వచ్చాడు. (Mama Mascheendra Movie). నటుడు, రచయిత  అయిన హర్షవర్ధన్ తెరకెక్కించటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజర్ అండ్ ట్రైలర్స్  ఇంట్రస్ట్ గా ఉండటం కలిసి వచ్చింది. ఈ నేపధ్యంలో రిలీజైన  ఈ సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు హిట్టు కొట్టగలిడా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

29


డబ్బుకోసం ఎంతకైనా తెగించే దుర్మార్గుడు పరశురామ్ (సుధీర్ బాబు). అందుకు అతనికో ప్లాష్ బ్యాక్ ఉంటుందనేది ప్రక్కన పెడితే ప్రస్తుతం తన చెల్లి దగ్గర ఉన్న  వందల కోట్ల ఆస్తి పై కన్నేస్తాడు. అందుకోసం  చెల్లెలు, ఆమె భర్తతో పాటు పిల్లల్ని చంపమని తన మనిషి దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. అయితే...సినిమాటెక్ గా  వాళ్ళు తప్పించుకుంటారు. కొంతకాలం అయ్యాక  పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడుతుంది. మరో ప్రక్క జాబ్  కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కూతురు  మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడుతుంది. అయితే ఈ ఇద్దరు సుధీర్ బాబులు మరెవరో కాదు తన పోలికే వచ్చిన తన మేనల్లుళ్లు అనే విషయం తెలుసుకుంటాడు పరుశరామ్. వాళ్ల ఆస్ది ని ఆక్రమించాననే కోపంతో తన మేనళ్లళ్లు ఇద్దరూ తన కూతురుని, తన దగ్గర పనిచేసే దాసు కూతురుని ప్రేమలో పడేసారని డౌట్ పడతాడు. అయితే ఆ అనుమానం నిజమేనా...అలాగే కూతుళ్ల విషయంలో ఓ ట్విస్ట్ ఉంటుంది.అది  ఏమిటి? చివరకు తన మేనల్లుళ్లు ఇద్దరినీ పరుశురామ్ ఏం చేసాడు..చివరకు ఏమైంది అనేది మిగతా కథ.   

39

ఈ సినిమా ఎలా ఉందీ అంటే రకరకాలుగా ఉంది. చాలా కన్ఫూజన్ గా ఉంటుంది. కావాలని కన్పూజ్ చేసారో లేక తను కన్పూజై ..మనని కన్పూజ్ చేసారో తెలియనంత కన్ఫూజన్ లో ఉంటుంది.  నన్ను కన్ఫ్యూజ్ చేయకండి.. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అంటాడు కదా మహేష్ బాబు.. అలా కన్ఫూజన్ లో మరిన్ని దెబ్బలు మనకు ఎక్కువే కొడతాడు దర్శక,రచయిత. సినిమా ప్రారంభమే అల వైకుంఠపురములో సినిమాని గుర్తు చేస్తూ మొదలువుతంది. అయితే ఫోర్స్ ఫుల్ గా నేరేషన్ స్టార్ట్ అయ్యి... unfunny conflict తో కథ ముందుకు వెల్తుంది. మెయిన్ నేరేషన్ కు సినిమాలో జోక్స్ అనబడే కామెడీ డైలాగులు కనెక్ట్ కావు. కోర్ ఐడియా ఏంటో సినిమా ఇంటర్వెల్ దాకా వచ్చినా అవగతం కాదు. ఫస్టాప్ చాలా లాగ్ అనిపిస్తుంది. సెకండాఫ్ అయినా ఎంగేజింగ్ గా ఉందా అంటే అదీ ఫస్టాఫ్ కు అమ్మా బాబులా ఉంటుంది. 

49


క్లైమాక్స్ మాత్రం కాస్త బాగుంది .అయితే అప్పటిదాకా థియేటర్ లో ఉండేవారు తక్కువ మంది. అయితే మీరు అనొచ్చు  90% సినిమాలు ఇలాగే ఉంటాయి కదా..పెద్దగా ఎంగేజ్ చేయవు కదా అని..అయితే ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే 90%  ఎంగేజింగ్ గా ఉండదు. నిజానికి టాలెంటెడ్ ఆర్టిస్ట్, అలాగే మంచి టాలెంట్ ఉన్న రైటర్ అయిన హర్షవర్దన్ నుంచి ఇలాంటి కంటెంట్ ని అయితే ఎక్సపెక్ట్ చేయము. హీరోను  ఎక్కువ గెటప్స్ లో చూపించాలని తాపత్రయం, ఏవో ట్విస్ట్ లు రాసేసుకున్నామనుకున్నారు కానీ అవి తెరపై పండుతాయో లేదో చూసుకోలేదు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా అర్దమయ్యేలా చెప్పకపోవటమే సినిమాని దెబ్బతీసింది. కన్ఫ్యూజన్ కామెడీ వర్కవుట్ అయితే సినిమా పూర్తి స్దాయి ఫన్ రైడర్ గా మారిపోయేది.  ఆర్జీవీ ఎపిసోడ్  ఎందుకు పెట్టారో దర్శకుడుకే తెలియాలి. 
 

59


సుధీర్ బాబు కు లావుపాటి రౌడీ వేషం బాగుంది తప్పించి అంతకు మించి సినిమాలో చేయటానికి ఏమీ లేదు. ముసలి పాత్రలోనూ మేకప్ సెట్ కాలేదనిపించింది. అయినా నడివయస్సుకే డబ్బై ఏళ్లవాడిలా ఆ మేకప్,తెల్ల గెడ్డాలు,విగ్ ఏమిటో మరి. డబ్బింగ్ కూడా వేరే వాళ్ల చేత చెప్పించటంతో సుధీర్ బాబు చేసిన ఫీల్ రాలేదు.  ఈషా రెబ్బా, మృణాళిని రవి జస్ట్ ఓకే అన్నట్లు చేసుకుంటూ వెళ్లారు.  నటుడిగా   హర్షవర్ధన్ సినిమా మొత్తం ఉన్నారు. కొత్తగా చేయటానికి లేదు కానీ బాగా చేసారు.  అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లు సోసో గా చేసారు.

69



దర్శకుడుగా, రచయితగా హర్షవర్ధన్ తన ప్రతిభను చూపించలేకపోయారు.   ఈ సినిమాలోని పాటలు బాగోలేదు.  నేపథ్య సంగీతం కూడా అంతే.  సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే.గొప్పగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి.  ఎడిటింగ్ సినిమా మొత్తం ఎడిట్ చేయచ్చేమో అనిపించేలా ఉంది. 

79
Mama Mascheendra Movie Review


  సుధీర్‌బాబు లావుపాటి వ్యక్తిగా మేకప్
క్లైమాక్స్


కథ,స్క్రీన్ ప్లే
ఎమోషన్స్ వర్కవుట్ కాకపోవటం
దర్శకత్వం
 

89
Mama Mascheendra Movie Review


ఈ సినిమా కామెడీనే..కానీ ఎక్కడా నవ్వురాదు. ఈ సినిమా థ్రిల్లరే..ఆ ట్విస్ట్ లకు  థ్రిల్ కాము. ’80s , ఎర్లీ ’90s లలో వచ్చిన రివేంజ్ కథలను గుర్తు చేస్తే సాగే ఈ సినిమా అప్పటి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతారా అనేది సందేహమే.  
రేటింగ్ : 1.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
 

99
Mama Mascheendra Movie Review


నటీనటులు : సుధీర్ బాబు, ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, 'మిర్చి' కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, 'షకలక' శంకర్, అలీ రేజా తదితరులు
ఛాయాగ్రహణం : పీజీ విందా
నేపథ్య సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
స్వరాలు : చైతన్ భరద్వాజ్
సమర్పణ : సోనాలి నారంగ్
నిర్మాతలు : సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : హర్షవర్ధన్ 
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023 
రన్ టైమ్: 2h 29m

click me!

Recommended Stories