`విశ్వంభర` నుంచి స్టార్‌ రైటర్‌ ఔట్‌..? దర్శకుడు తగ్గడం లేదు, చిరంజీవి పట్టించుకోలేదా?

Published : Mar 13, 2024, 06:32 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓ షాకింగ్‌ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   

PREV
16
`విశ్వంభర` నుంచి స్టార్‌ రైటర్‌ ఔట్‌..? దర్శకుడు తగ్గడం లేదు, చిరంజీవి పట్టించుకోలేదా?

చిరంజీవి `భోళాశంకర్‌` తో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు భారీ సినిమాతో రాబోతున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` వంటి క్లాసిక్‌ జోనర్‌తో `విశ్వంభర` చిత్రం చేస్తున్నారు. ఇందులో సోషియో ఫాంటసీ ఎలిమెంట్లు ఉంటాయట. పీరియడ్‌ అంశాలకు, ఫాంటసీ ఎలిమెంట్లని జోడించి దర్శకుడు వశిష్ట ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

26
Vishwambhara

ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూట్‌ చేస్తున్నారట. తాజాగా ఫ్యామిలీ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తున్నారు. ఇందులో ఓ సాంగ్‌ ఉంటుందని ఆ పాట చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటాయని ప్రచారంలో ఉన్న విషయంతెలిసిందే. సురభి, ఆషికా రంగనాథ్‌, మీనాక్షి చౌదరి, మృణాల్‌ కూడా కనిపిస్తారని టాక్. 
 

36

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. సినిమా నుంచి స్టార్‌ రైటర్‌ తప్పుకున్నారట. ఆయన ఎవరో కాదు సాయి మాధవ్‌ బుర్రా. ఇటీవల టాలీవుడ్‌లో టాప్‌ మూవీస్‌కి ఆయన రైటర్‌గా పనిచేస్తున్నారు. చిరంజీవి నటించిన `సైరా`కి కూడా ఆయన పనిచేశారు. `విశ్వంభర`కి కూడా ఆయన పనిచేస్తున్నారు. అయితే తాజాగా సాయి మాధవ్‌ బుర్రా సినిమా తప్పుకున్నట్టు తెలుస్తుంది. 
 

46

కారణాలు వెతికితే.. దర్శకుడితో క్రియేటివ్‌ డిఫరెంట్స్ అని తెలుస్తుంది. దర్శకుడు వశిష్ట ఒక స్టయిల్‌ని ఫాలో అవుతున్నారట. కానీ అది సాయిమాధవ్‌కి నచ్చలేదని, ఇలానే రాయాలని ఆయన చెప్పడం, ఈ సీనియర్‌ రైటర్‌కి నచ్చకపోవడంతో సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. మెగాస్టార్‌ లాంటి హీరో సినిమాకి డైలాగ్‌లు, సీన్లు ఒక రేంజ్‌లో ఉండాలని, కానీ దర్శకుడు మరో స్టయిల్‌ని ఫాలో అవుతున్నారని, ఇక్కడే ఇద్దరికి చెడిందంటున్నారు. దర్శకుడు వినకపోవడంతో సాయిమాధవ్‌ తప్పుకున్నట్టు తెలుస్తుంది.
 

56
Vishwambhara

అయితే ఈ విషయంలో చిరంజీవి ప్రమేయం లేదని, ఆయనకు తెలియకుండానే ఇది జరిగిందని ఫిల్మ్ నగర్‌ టాక్‌. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది.   `విశ్వంభర` సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది. ఇందులో చిరు, త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. యూవీ క్రియేషన్స్ సుమారు 200కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదల చేయబోతున్నారు.  

66

ఇదిలా ఉంటే ఈ మూవీకి దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్ని పనిచేస్తున్నారు.  చిరంజీవితో ఓ సాంగ్‌కి ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెగాస్టార్‌తో పనిచేయాలనేది ఆయన డ్రీమ్‌. ఈ మూవీతో నెరవేరిందని, ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఇటీవల విజయ్‌ బిన్ని `నా సామిరంగ` చిత్రంతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. నాగార్జునతో చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories