హీరోయిన్స్ గా మారిన అక్కాచెల్లెళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వారిలో కాజల్-నిషాలు ఉన్నారు. అక్క కాజల్ చూపిన దారిలో నిషా అగర్వాల్ ఎదగాలనుకున్నారు. అయితే అక్క మాదిరి ఆమెకు కలిసి రాలేదు. 2010లో సంపత్ నంది దర్శకత్వంలో 'ఏమైంది ఈవేళ' టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్. ఈ చిత్రంతో నిషా అగర్వాల్ హీరోయిన్ అయ్యారు. అనంతరం సోలో మూవీతో మరో విజయం ఖాతాలో వేసుకుంది.