కాజల్, తమన్నా, రకుల్, కీర్తి సురేష్, శ్రియా... టాలీవుడ్ హీరోయిన్స్ సైడ్ బిజినెస్ లు ఇవే..

First Published | Mar 27, 2023, 3:12 PM IST

టాలీవుడ్ హీరోయిన్లు వరుస చిత్రాలతో అలరించడంతో బాగానే సంపాదిస్తున్నారు. మరోవైపు సైడ్ బిజినెస్ లు కూడా రన్ చేస్తున్నారు. ఎవరెవరు ఏఏ వ్యాపారాలు చేస్తున్నారో తెలుసుకుందాం.
 

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘చందమామ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలతో జోడీగా వెండితెరపై మెప్పించింది. ప్రస్తుతమూ భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇటు సినిమాలతో పాటు అటు మర్సాలా Marsala  అనే జ్యూయెల్లరీని ప్రారంభించింది. ఇందుతో తన చెల్లి నిశా అగర్వాల్ కూడా పార్టనర్ గా ఉన్నారు. ప్రస్తుతం కాజల్ ‘ఇండియన్ 2’, ‘NBK108’లో నటిస్తోంది.
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia)  ప్రస్తుతం వరుస చిత్రాలతో హిట్లు అందుకుంటోంది. మున్ముందు ‘భోళా శంకర్’, ‘జైలర్’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే మిల్క్ బ్యూటీ కూడా 2015లోనే జ్యూయేల్లరీ బిజినెస్ ను ప్రారంభించింది. ‘వైట్ అండ్ గోల్డ్’పేరుతో ఈ సంస్థ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. 


మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) కూడా సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ‘భూమిత్ర‘ అనే పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ ను నడుపుతోంది. పూర్తిగా ప్రకృతి సహజ సిద్ధమైన ఔషదాలతో స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం  ‘దసరా’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

సీనియర్ నటి శ్రియా శరన్ (Shriya Saran) కూడా ఎప్పుడో సెకండ్ ఇన్ కమ్ కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. శ్రీ స్పందన స్పా సెంటర్ ను ప్రారంభించి అదనంగా సంపాదిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపూపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.  
 

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కొన్నేండ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా దుమ్ముదులిపిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక రకుల్ సైడ్ బిజినెస్ గా ట్రెయినింగ్ జిమ్స్ ను ఫ్రాంచైజీలుగా రన్ చేస్తోంది. అందులో రెండు హైదరాబాద్ లో నే ఉన్నాయి. గచ్చిబౌలి, కోకాపేట్, అలాగే ఏపీలోని విశాఖపట్నంలో మరోకటి ఉంది. సినిమాల్లోకి రాకపోతే తను జిమ్ ట్రైయినర్ గానే మారిపోయేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పొకొచ్చింది.
 

సౌత్ హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha)  కన్నడ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా.. చిన్నపాటి బిజినెస్ ను కూడా ప్రారంభించింది. బెంగళూరులోని లావెల్లే రోడ్‌లోని బూట్ లెగ్గర్ అనే రెస్టారెంట్‌కు ఆమె ఓనర్‌. అలాగే వారి సొంతంగా బెంగళూరులోనే ఆస్పత్రులు కూడా ఉండటం విశేషం. 
 

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) ప్రస్తుతం సినిమాల కంటే బిజినెస్ లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కొన్నేండ్లుగా సౌత్ ఇండస్ట్రీకి దూరమైనా, బాలీవుడ్ లో కలిసి రాకపోయినా తనకు సైడ్ బిజినెస్ ల వల్లే ఆదాయం సమకూరేదంట. గోవాలో ఇలియానాకు పలు బేకరీలు, రెస్టారెంట్లు రన్ చేస్తోంది. అంతేకాకుండా సొంతంగా డిజైన్ లేబుల్ ను నడుపుతుందని తెలుస్తోంది.
 

కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన తాప్సీ పన్ను (Taapsee) సైతం సైడ్ బిజినెస్ లో అడుగుపెట్టింది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో సెలబ్రెటీలకు పెళ్లిలను గ్రాండ్ నిర్వహించింది.  ఈ బిజినెస్ లో తమ చెల్లి, స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్లు ఇలా రెండు చేతులా సంపాదిస్తుండటం విశేషం.

Latest Videos

click me!