అయితే అంతకు ముందు విడాకులు, మయోసైటిస్ వ్యాధి వచ్చినప్పుడు సమంత ఏం చేయలేని స్థితిలో ఉంది. ఓ రకమైన డిప్రెషన్‌లో ఉంది. ఆ సమయంలో తనకు వెన్నుతట్టి, ప్రోత్సహించిన వ్యక్తి ఒకరు ఉన్నారట.
ఓ స్టార్ సింగర్ భర్త నే కారణం అట. సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. అతను ఎవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్. సమంతకి రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ దాదాపు 17ఏళ్లుగా వీరిద్దరి మధ్య మంచిస్నేహం ఉంది.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమయంలో సమంత వరకు తరచూ వెళ్లేవాడట రాహుల్ రవీంద్రన్. తిరిగి సినిమాలు చేసేలా ప్రోత్సహించాడట. ఎంకరేజ్ చేశాడట. ఆమెలో స్ఫూర్తి నింపాడట.
ఆయన ఇచ్చిన ధైర్యంతో మళ్లీ సినిమాలు చేయడానికి ముందుకు వచ్చి ఒకటి రెండు సినిమాలు కూడా చేసింది. `ఖుషి` మూవీలో పాల్గొంది. అలాగే వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసింది. ఇలా తాను మళ్లీసినిమాలు చేయడానికి కారణం రాహులే అని, ఆయన లేకపోతే తాను మళ్లీ ఈ యథాస్థితికి వచ్చేదాన్ని కాదని చెప్పింది.
రాహుల్‌తో 17ఏళ్లుగా స్నేహం ఉంది. ఆయన తరచూ నా ఇంటికి వచ్చి గేమ్స్ ఆడేవాడు. ఈ క్రమంలో తన ఆలోచనలకు ప్యారిటీ ఇచ్చేవాడు. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఇవి గతంలో చెప్పిన విషయం. ఇప్పుడు వైరల్ అవుతుండటం విశేషం. అయితే తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సమంత ఎప్పుడు బయటకు వస్తుంది? ఎప్పుడు సినిమాలు చేస్తుందనేది చూడాలి.
read more: రివేంజ్ స్టోరీతో పాయల్ రాజ్‌పుత్.. ఇండియన్ సినిమా షేక్ అయ్యే మ్యాటర్