చీరకట్టులో హోయలు పోయిన స్టార్ కిడ్.. ఎరుపెక్కిన అందాలతో మత్తెక్కిస్తున్న శివానీ రాజశేఖర్ పోజులు..

Published : Aug 04, 2022, 05:37 PM IST

స్టార్ కిడ్ శివానీ రాజశేఖర్ (Shivani Rajashekar) గ్లామర్ షోతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తాజాగా చీరకట్టులో కనిపించిన ఈ ముద్దుగుమ్మ మతిపోయే పోజులతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరిస్తోంది.    

PREV
16
చీరకట్టులో హోయలు పోయిన స్టార్ కిడ్.. ఎరుపెక్కిన అందాలతో మత్తెక్కిస్తున్న శివానీ రాజశేఖర్ పోజులు..

టాలీవుడ్ సినీయర్ హీరో రాజశేఖర్‌ కూతురు, యంగ్ హీరోయిన్  శివానీ రాజశేఖర్‌ గతేడాదే వెండితెరకు పరిచయం అయ్యింది. స్టార్ కిడ్ గా అందరికీ పరిచయం అయిన ఈ బ్యూటీ.. తనను తానుగా పరిచయం చేసుకునేందుకు తెగ తాపత్రాయ పడుతోంది. గతేడాది ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ చిత్రంతో అలరించింది.
 

26

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు శివానీ ఇంటర్నెట్ ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లతో పాటు, రీల్స్ కూడా చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది. 

36

తాజాగా యంగ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ చీరకట్టులో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ బ్లాజ్, రెడ్ శారీ ధరించిన తెలుగు బ్యూటీ.. హాట్ లుకింగ్ ను సొంతం చేసింది. స్కిన్ షో చేస్తూ మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. మత్తు చూపులతో కుర్రకారు గుండె వేగాన్ని పెంచుతోంది.

46

అటు ట్రెండీ వేర్, ఇటు ట్రెడిషనల్ వేర్ లో శివానీ తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంటోంది. ఇప్పటికే వెండితెరపైకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాల్సిన శివానీకి కొద్దిగా కాలం కలిసిరాలేదు. దీంతో గతేడాది డిసెంబర్ 24న ఓటీటీ వేదికన రిలీజ్ అయిన WWW చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

56

గతంలోనే శివానీ ఎంట్రీ గ్రాండ్ జరగాల్సి ఉంది. కరోనా కారణంగా.. తను నటించిన రెండు సినిమాలు ఆగిపోవడం వల్ల ఇంకా బిగ్ స్క్రీన్ పై మెరియలేకపోతోందీ బ్యూటీ. అయినా స్టార్ కిడ్ గా మాత్రం శివానీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇందు కోసం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తోంది.
 

66

శివానీ లీడ్ యాక్ట్రెస్ గా నటించిన రెండు చిత్రాలు ‘అద్భుతం’, ‘టూ స్టేట్స్’ ఆగిపోవడంతో ఈ బ్యూటీ ఎంట్రీకి కాస్తా బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’తో మాత్రం ఓటీటీ ఆడియెన్స్ కు దగ్గరైంది. ప్రస్తుతం మరిన్ని ఆఫర్స్ కోసం ఇలా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ దర్శక నిర్మాతల ఫోకస్ తనపై పడేలా చేస్తోంది.
 

click me!

Recommended Stories