పెళ్లి పీఠలెక్కేందుకు సిద్ధమవుతున్న హన్సిక.. కాబోయేవాడు ఎవరు? ఆయన ఏంచేస్తాడంటే ?

Published : Aug 04, 2022, 04:43 PM IST

పాలబుగ్గల సుందరి హన్సిక పెళ్లికి రెడీ అవుతుందట. కెరీర్‌ ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోతున్న నేపథ్యంలో ఆమె ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కావాలనుకుంటుందట. తాజాగా ఆమె పెళ్లి వార్త వైరల్‌ అవుతుంది.  

PREV
16
పెళ్లి పీఠలెక్కేందుకు సిద్ధమవుతున్న హన్సిక.. కాబోయేవాడు ఎవరు? ఆయన ఏంచేస్తాడంటే ?
hansika motwani

హన్సిక(Hansika Motwani) ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. మిల్కీ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. పూరీ పరిచయం చేసిన ఈ పాలబుగ్గల సుందరి అల్లు అర్జున్‌తో లాంచ్‌ అయ్యింది. `దేశముదురు` చిత్రంలో నటించి మెప్పించింది. సినిమా పెద్ద విజయం సాధించడంతో, హన్సిక ఫ్రెష్‌ ఫేస్‌ కావడంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. 
 

26
hansika motwani

కొన్నేళ్లపాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన హన్సికకి ఇటీవల ఛాన్స్ లు తగ్గాయి. అడపాడదడపానే వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. కమర్షియల్‌ చిత్రాల ఆఫర్‌లు రావడం లేదు. ఆమె వద్దనుకుంటుందా? లేక రావడంలేదా? అనేదాంటో ఏదినిజమో గానీ ఈ మధ్య కమర్షియల్‌ చిత్రాల్లో కనిపించడం లేదు హన్సిక. చేసిన సినిమాలు కూడా మహిళా పాత్ర ప్రధానంగా సాగేవే కావడం విశేషం. 
 

36

దీంతో లైఫ్‌లో సెటిల్‌ కావాలనుకుంటుందట ఈ 32ఏళ్ల భామ. ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతుందట. త్వరలోనే పెల్లి పీఠలెక్కేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. హన్సిక ఓ రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లి చేసుకోబోతుందనే వార్త సౌత్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

46

ఆ సదరు పొలిటికల్‌ లీడర్‌ తనయుడు వ్యాపారాల్లో ఉన్నాడని తెలుస్తుంది. హన్సిక పెళ్లి మ్యాటర్‌ ఇంట్లోనూ చర్చించారట. అబ్బాయి ఫ్యామిలీతోనూ చర్చలు జరిగాయని, ఇద్దరు ఫ్యామిలీస్‌ అంతా ఓకే అనుకోవడం కూడా జరిగిపోయిందంటున్నారు. త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ జరుగ నుందని, అనంతరం వెంటనే మ్యారేజ్‌కి ప్లాన్‌ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడిది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.

56

`చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ సినిమాలతో చిత్ర రంగానికి పరిచయం అయ్యింది. దేశముదురు` సినిమాతో హీరోయిన్‌గా నటించి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విజయంతో `కంత్రి`, `మస్కా`, `బిల్లా`, `జయీభవ`, `సీతారాముల కళ్యాణం`, `కందిరీగ`, `ఓ మై ఫ్రెండ్‌`, `దేనికైనా రెడీ`, `సమ్‌థింగ్ సమ్‌థింగ్‌`, పాండవులు పాండవులు తుమ్మెద`, `పవర్‌`, `లక్కున్నోడు`, `తెనాలి రామకృష్ణ` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇందులో సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువగా ఉండటంతో టాలీవుడ్‌కి దూరమైంది. తమిళంలో చేస్తూ వస్తోంది. 

 

66

ప్రస్తుతం హన్సిక నటిగానూ బిజీగా ఉండటం విశేషం. ఆమె తెలుగులో `105మినిట్స్`, `మై నేమ్‌ ఈజ్‌ శృతి` చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో `పార్టనర్‌`, `రౌడీ బేబీ`తోపాటు మరో మూడు సినిమాలున్నాయి. అరడజను సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఈ టైమ్‌లో పెళ్లి వార్త తెరపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి అందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories