Heroines Love Stories: డేటింగ్ ఒకరితో, పెళ్లి మరొకరితో.. క్రేజీగా ఈ స్టార్ హీరోయిన్ల లవ్ స్టోరీలు

Published : Feb 28, 2026, 04:45 PM IST

Heroines Love Stories: హీరోయిన్ల ప్రేమలు చాలా విచిత్రంగా ఉంటాయి. మొదట ప్రేమించింది ఒకరిని, చివరికి పెళ్లి చేసుకునేది మరొకరిని. మరి ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.  

PREV
110
ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న స్టార్‌ హీరోయిన్లు

రష్మిక మందన్నా ఇటీవల విజయ్‌ దేవరకొండని పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ విజయ్‌ కంటే ముందే రష్మిక.. కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టిని ప్రేమించింది. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇలా ఆమె మొదట ప్రేమించింది ఒకరిని, చివరికి పెళ్లి చేసుకున్నది మరొకరిని. ఇలానే బాలీవుడ్‌లో చాలా మంది జంటలున్నాయి. దీపికా, ఐశ్వర్య, కరీనా వంటి వారంతా మొదట వేరే హీరోలను ప్రేమించారు. చివరికి మరో నటుడిని పెళ్లి చేసుకున్నారు. 

210
కరీనా కపూర్ (Kareena Kapoor)

కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ది ప్రేమ వివాహమే. కానీ సైఫ్‌కు ముందు, కరీనా.. షాహిద్ కపూర్‌తో సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండేది. 2003లో 'ఫిదా' సినిమా సెట్స్‌లో వీరి ప్రేమ మొదలైందని, దాదాపు 5 ఏళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నారని చెబుతారు. షాహిద్‌తో బ్రేకప్ తర్వాత కరీనా, సైఫ్‌తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.

310
ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai)

ఐశ్వర్య రాయ్ ప్రేమకథలు ఎవరికీ తెలియనివి కావు. 1999లో వచ్చిన 'హమ్ దిల్ దే చుకే సనమ్' షూటింగ్ టైంలో ఆమె సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడింది. 2001లో వీరి బంధం ముగిసింది. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌తో ప్రేమాయణం నడిపినా, కొన్ని నెలలకే ఆ బంధం కూడా పెటాకులైంది. చివరకు 2006లో 'ఉమ్రావ్ జాన్' సెట్స్‌లో అభిషేక్ బచ్చన్‌తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. 2007లో వీరు పెళ్లి చేసుకున్నారు.

410
దీపికా పదుకొనె (Deepika Padukone)

దీపికా పదుకొణె, రణ్‌బీర్ కపూర్ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య 2008లో ప్రేమ మొదలై, ఏడాది తిరిగేలోపే విడిపోయారు. ఆ తర్వాత 2012లో రణ్‌వీర్ సింగ్‌తో దీపిక ప్రేమకథ మొదలైంది. ఈ జంట 2018లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

510
అనుష్కశర్మ (Anushka Sharma)

అనుష్క శర్మ ఒకప్పుడు రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. 2010లో వచ్చిన 'బ్యాండ్ బాజా బారాత్' సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ మొదలైందని అంటారు. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. రణ్‌వీర్‌తో విడిపోయాక, అనుష్క క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది. వీరు 2017లో పెళ్లి చేసుకున్నారు.

610
బిపాసా బసు (Bipasha Basu)

బిపాసా బసు 1996 నుంచి 2002 వరకు డీనో మోరియాతో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ తర్వాత 2002 నుంచి 2011 వరకు జాన్ అబ్రహంతో డేటింగ్ చేసింది. అనంతరం హర్మాన్ బవేజాతో ప్రేమలో పడి, 2014లో విడిపోయింది. చివరికి బిపాసా, కరణ్ సింగ్ గ్రోవర్‌తో ప్రేమలో పడి 2016లో పెళ్లి చేసుకుంది.

710
ప్రియాంక చోప్రా (Priyanka Chopra)

అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను డిసెంబర్ 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా, ఒకప్పుడు షాహిద్ కపూర్‌తో ప్రేమలో ఉంది. 2009లో 'కమీనే' సినిమా సెట్స్‌లో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కానీ ఈ బంధం కేవలం 2 ఏళ్లు మాత్రమే నిలిచింది. షాహిద్ కంటే ముందు హర్మాన్ బవేజాతో కూడా ప్రియాంక పేరు వినిపించింది.

810
శిల్పా శెట్టి (Shilpa Shetty)

1994లో 'మైన్ ఖిలాడీ తు అనారీ' సినిమా సెట్స్‌లో శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్‌తో ప్రేమలో పడింది. కానీ ఈ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. 2001లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకోగా, శిల్పా 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది.

910
కరిష్మా కపూర్‌ (Karishma Kapoor)

కరిష్మా కపూర్ 2003లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అంతకంటే ముందు ఆమె అభిషేక్ బచ్చన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. 'హా మైనే భీ ప్యార్ కియా' సినిమా సెట్స్‌లో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ పెళ్లికి ముందే ఈ బంధం ముగిసిపోయింది.

1010
కత్రినా కైఫ్‌ (Katrina Kaif)

2005లో వచ్చిన 'మైనే ప్యార్ క్యూన్ కియా' సినిమా షూటింగ్ టైంలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. కానీ 2010లో వీరు విడిపోయారు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. ఈ బంధం దాదాపు 6 ఏళ్ల పాటు సాగింది. చివరకు ఆమె విక్కీ కౌశల్‌తో ప్రేమలో పడి, 2021లో పెళ్లి చేసుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories