హీరోయిన్ గా పెద్ద ఛాన్స్ లు అందుకోలేకపోయింది. అందుకున్నవి కూడా సెకండ్ హీరోయిన్ గా మాత్రమే, అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో తెలుగు తెరపై స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగా ఉండిపోయింది తాప్సీ. దాంతో టాలీవుడ్ లో తన టైమ్ బాగోలేదని..బాలీవుడ్ కు మకాం మార్చేసింది బ్యూటీ. బాలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు తగలడంతో..టాలీవుడ్ పై..రెచ్చిపోయి ఘాటు వ్యాఖ్యలు చేసింది.