Samantha : ‘వెలుతురిని వెతుక్కోవాలం’టూ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. సామ్ కు ధైర్యం చెబుతున్న ఫ్యాన్స్!

First Published | Feb 5, 2023, 1:10 PM IST

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. అభిమానులతో నిత్యం అందుబాటులో ఉండే సామ్.. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. సౌత్ లో భారీ ఫాలోయింగ్ సందపాధించుకున్న సామ్ అభిమానులకు నెట్టింట నిత్యం అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల  ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అందుతున్న అప్డేట్స్ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా మరో పోస్టు పెట్టారు. ఇందుకు ఫ్యాన్స్ కూడా సందిస్తున్నారు.
 


ప్రస్తుతం సమంత భారీ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ రూస్సో బ్రదర్స్ నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ "సిటాడెల్" (Citadel) సిరీస్ ఇండియన్ వెర్షన్ లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలనే ఫస్ట్ లుక్ కూడా విడుదలై భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
 

ఇదిలా ఉంటే.. సమంత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. తన హెల్త్, సినిమాలు, తదితర విషయాలను చెబుతూనే ఉన్నారు. రీసెంట్ గా మయోసైటిస్ తో బాధపడ్డ సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకున్నట్టు తెలుస్తోంది. 
 

ఈక్రమంలో సమంత ఇంట్రెస్టింగ్ గా పోస్ట్ పెట్టారు. సూర్యరష్మి వెలుతురులో మెరిసిపోయే అందంతో ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోకు ‘వెలుతురును వెతుక్కోవాలంటూ..’ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అభిమానులు ఇంట్రెస్టింగ్ గా స్పందిస్తున్నారు.  
 

కొందరు అభిమానులు స్పందిస్తూ.. సమంత మీలోనే వెలుతురు ఉందంటూన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండటం.. షూటింగ్ లో బిజీ అయిపోతుండటం సంతోషంగా ఉందని కామెంట్లు  పెడుతూ ధైర్యం చెబుతున్నారు. మరోవైపు ఆమె అందాన్ని కూడా పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు విజయ్ దేవరకొండతోనూ ‘ఖుషి’లో నటిస్తోంది.

Latest Videos

click me!