రీసెంట్ గా సందీప్ కిషన్ మైఖేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కు.. మైఖేల్ మూవీ ఊరటనిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు. కాని ఈ మూవీ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడంలేదు. శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలకపాత్రల్లో నటించారు.