Published : May 01, 2022, 03:11 PM ISTUpdated : May 01, 2022, 03:14 PM IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని మొదటి నుంచీ లీక్స్ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సారి ఏకంగా ట్రైలర్ లీకవ్వడం షాక్ కు గురిచేస్తోంది.
ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. సూపర్ ప్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), గ్లామర్ బ్యూటీ కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు.
28
వరుస అప్డేట్స్ తో ఆడియెన్స్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించిన ‘సర్కారు వారి పాట’ మేకర్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తాకింది. ఈ చిత్రానికి సంబంధిచిన ప్రతి అప్డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేయకముందే లీక్ అవుతూ షాక్ కు గురి చేస్తున్నాయి.
38
గతంలో ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ ‘కళావతి’ సాంగ్ ను చిత్ర యూనిట్ ప్రేమికుల దినోత్సం కోసం రెడీ చేసింది. కానీ అధికారికంగా రిలీజ్ చేయకముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అయ్యింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ‘పెన్సీ’ అప్పుడు కూడా ఇదే పరిస్థితి.
48
ఆ తర్వాత అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. అయితే రేపు సర్కారు వారి పాట ట్రైలర్ (Sarkaru Vaari Paata) అఫిషియల్ గా రిలీజ్ కానుంది. కానీ మళ్లీ చిత్ర యూనిట్ అజాగ్రత్త వల్ల గత పరిస్థితే ఎదురైంది. ఈ సారి ఏకంగా ట్రైలర్ నే లీక్ చేశారు.
58
ట్రైలర్ లోని 10 సెకండ్ల ఇట్రెస్టింగ్ బిట్ ను సోషల్ మీడియాలో వదిలారు కొందరు. ప్రస్తుతం ఈ బిట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇందుకు చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అయితే మేకర్స్ ఇలాగే చూస్తు ఉంటే ఏకంగా మొత్తం సినిమానే లీక్ చేస్తారంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు.
68
మహేశ్ బాబు బ్యాంకు లాకర్ల తాళాల గుత్తిని చేతి పట్టుకుని విలన్స్ కొడుతున్న సీన్ లీక్ అయిన వీడియోలో కనిపిస్తోంది. ఇలాంటి కీలకమైన యాక్షన్ సీన్స్ కూడా ముందే రివీల్ అవ్వడం పట్ల మేకర్స్ జాగ్రత్త అర్థమవుతుందని నెటిజన్లు అంటున్నారు.
78
ఒక్క సర్కారు వారి పాట మూవీ విషయంలోనే తరుచుగా లీక్ లు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. అయితే ట్రైలర్ ఎడిటింగ్ సమయంలోనే ఫోన్ లో రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైనా మరింత జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు.
88
మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ గట్టిగానే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రానుంది. మహేశ్ బాబు బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇందులో మంచి మేసేజ్ కూడా ఇచ్చాడంట దర్శకుడు పరశురామ్ పెట్ల.