బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కంటీన్యూ అవుతోంది కియారా అద్వానీ. బాలీవుడ్ లో మొదటి రెండు సినిమాలతోనే తానేంటో నిరూపనించుకున్న కియారా అద్వాని.. ఆతరువాత తెలుగులో కూడా ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈబ్యూటీ.. ఆతరువాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించి.. అది ప్లాప్ అవ్వగానే టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.