Ahimsa
'చిత్రం', 'నువ్వు నేను', 'జయం' వంటి సూపర్ హిట్స్ డైరక్టర్ తేజ సినిమాలంటే ఇంటెన్స్ లవ్ స్టోరీ ని యూత్ ని ఆకట్టుకునే లా తీస్తాడని పేరు. అయితే ఆయన సినిమాలు కొంతకాలంగా ట్రెండ్ కు దూరంగా ప్లాఫ్ లకు దగ్గరగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ వంటి యంగస్టర్స్ ని చాలా మందిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేసిన అనుభవం ఉండటంతో నిర్మాత సురేష్ బాబు తన రెండవ కుమారుడుని ఆయన చేతిలో పెట్టారు. అందులోనూ గతంలో పెద్ద కుమారుడు రానాకి హిట్ ఇవ్వటం కూడా ఓ కారణం కావచ్చు. మరి తేజ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా...ఎప్పుడూ ఆర్టిస్ట్ లను కొడతాను అని చెప్పే ఆయన ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేక ఆర్టిస్ట్ లను కొట్టడం దాకానే సరిపెట్టుకున్నారా వంటి విషయాలను రివ్యూలో చూద్దాం.
Ahimsa
స్టోరీ లైన్:
అహింసని నమ్మే రఘు (దగ్గుబాటి అభిరాం) కి మరదలు అహల్య (గీతికా తివారి) ప్రాణం. ఆమెకు బావ రఘు అంటే ప్రాణం. ఇదంతా చూసిన పెద్దలు వీళ్లద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. ఎంగేజ్మెంట్ అయిన రోజే ఆమెపై అత్యాచారం జరుగుతంది. సిటీలో బాగా డబ్బు మదంతో ఉన్న దుష్యంత్ రావు (రజత్ బేడి) ఇద్దరు కొడుకులు అహల్యను పాడు చేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను రఘు హాస్పిటల్‌లో చేరుస్తాడు. అతని అండగా ఓ లేడీ లాయర్ లక్ష్మి (సదా).. ఆమె భర్త నిలుస్తారు. అయితే అవతలి దుష్యంత్ రావు చాలా డబ్బున్నవాడు అని ముందే చెప్పుకున్నాంకదా... తన డబ్బు, పలుకుబడిని ఉపయోగించి కేసుని నీరు గార్చే ప్రయత్నం చేస్తూంటాడు. హీరోకు సాయింగా ఉండే సదాని , ఆమె కుటుంబాన్ని దుష్యంత రావు చంపేస్తాడు. అయితే రఘు హీరో కదా ఊరుకుంటాడా... ఎక్కడెక్కడి సాక్ష్యాలను తీసుకొచ్చి కేసుని తనకు అనుకూలంగా మార్చుకునే సమయంలో చటర్జీ ఎంట్రీతో అంతా రివర్స్ మారవుతుంది. అహల్యను చంపేయటానికి విలన్ రెడీ అవుతాడు. అప్పుడు తను నమ్మే అహింసను రఘు వదిలేయాలనుకుంటాడు... ? అప్పుడు ఏం జరుగుతుంది...రఘు, అహల్యలకు న్యాయం జరుగుతుందా? దుష్యంత్ రావు ఏమౌతాడు? అనేది మీరు ఊహించలేకపోతే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే.
Ahimsa
విశ్లేషణ:
ఎప్పటి కథ ఇది... అప్పట్లో చలపతిరావు,మోహన్ బాబు రేప్ చేసే రోజుల్లో ఇలాంటికథలు వచ్చేవి. అయినా వారసుడుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలంటే లవ్ స్టోరీ తోనో, లేక వాడు తోపు, వాడికి అన్ని వచ్చు అని చెప్పే యాక్షన్ సినిమాతో చేస్తూంటారు. అయితే అది పాత పడిపోయింది. ఆ వారసుడు కోసం జనం ఎదురుచూస్తూంటే ఖచ్చితంగా ఆ కుటుంబ వారసత్వ ఇమేజ్ ని ఆపాదిస్తూ చేయచ్చు. కానీ ఇంకా జయం, నువ్వునేను టైమ్ నాటి లవ్ స్టోరీని బయిటకు తీసి సినిమా తీయాలనే ఆలోచన దర్శకుడో, నిర్మాతదో కానీ చూసేవారికి హింసే. ఏదైమైనా OTT ప్లాట్ ఫామ్ లలో విభిన్నమైన కథలు, కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్న ఈ సమయంలో ఏ ఇమేజ్ లేని ఓ కొత్త కుర్రాడు మీద ఇలాంటి పాతికేళ్ల క్రితం నాటి ప్లాట్ ని ఎత్తుకోవటం, దాన్ని అంతే పాతగా డీల్ చేయటం తేజకే చెల్లింది. బయిట చక్కటి జానర్ ఫిల్మ్ లు వస్తున్న ఈ సమయంలో కొత్త కుర్రాడితో మసాలా సినిమా చేయాలనే ఆలోచన మాత్రం ప్రేక్షకుల మీద పగే. అయితే ప్రేక్షకులు తెలివైన వాళ్లు..టాక్ వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. పోనీ ఏదో కథ..ఎప్పటి కథో ...వచ్చాం చూద్దాం అనుకుంటే సాలిడ్ గా కాంప్లిక్ట్ ఉండదు.లీనం చేయదు. అదే ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్. అయితే తేజ తన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ మీద వదలలేదు. క్లైమాక్స్ లో హీరో,హీరోయిన్స్ అడవుల్లోకి తోలేసాడు.
Ahimsa
సినిమా ప్రారంభమే మనకు ఇంట్రస్ట్ పోతుంది. పోలీస్ ఆఫీసర్ రవి కాలే, విలన్ దుశ్యంతరావు కోసం వెతుక్కుంటూ వెళతాడు. ఆలా ఆ కేసు ఫైల్ చదువుతుంటే ఈ సినిమా కథ మొదలవుతుంది. ,ఏదైమైనా కథ రొటీన్ కాంప్లిక్ట్ తో నడవటం, హీరోకు మనం ఇంకా అలవాటు పడకపోవటం వల్ల (నాలుగైదు సినిమాలకు అలవాటు అనేది ఆటో మేటిక్ గా జరుగుతుంది) వల్ల రిలాక్స్ గా కూర్చుని సెల్ వాచ్ చేస్తూంటాము...ఏసీ సరిపోలేదని అర్దమై థియోటర్ వాళ్లపై కోపం తెచ్చుకుంటాము. ఇక ఈ సినిమాలో వచ్చే సీన్స్ ని cliche అనాలి. చాలా భాగం గతంలో మనం చూసేసినవే. ఊహించేవే కావటం ఓ విశేషం. అయితే డైరక్టర్ ఒకటి అనుకుని ఉండచ్చు...ఈ జనరేషన్ వాళ్లు తన సినిమా లు చూసి ఉండరు కాబట్టివాళ్లు ఎంజాయ్ చేస్తారని. వాళ్లెవరు థియేటర్ కు కదిలి వెళ్లటం లేదాయే. అయినా ఇంటర్వెల్ తర్వాత ఐటమ్ సాంగ్ ఇంకా ఈ రోజుల్లో అవసరమా..అసలే ఎప్పుడు సినిమా అయ్యిపోతుందా అని ఎదురుచూసేవాళ్ళకు ...క్లైమాక్స్ అయ్యాక కూడా సినిమా చూపించటం ఏమిటి....
సినిమా ప్రారంభమే మనకు ఇంట్రస్ట్ పోతుంది. పోలీస్ ఆఫీసర్ రవి కాలే, విలన్ దుశ్యంతరావు కోసం వెతుక్కుంటూ వెళతాడు. ఆలా ఆ కేసు ఫైల్ చదువుతుంటే ఈ సినిమా కథ మొదలవుతుంది. ,ఏదైమైనా కథ రొటీన్ కాంప్లిక్ట్ తో నడవటం, హీరోకు మనం ఇంకా అలవాటు పడకపోవటం వల్ల (నాలుగైదు సినిమాలకు అలవాటు అనేది ఆటో మేటిక్ గా జరుగుతుంది) వల్ల రిలాక్స్ గా కూర్చుని సెల్ వాచ్ చేస్తూంటాము...ఏసీ సరిపోలేదని అర్దమై థియోటర్ వాళ్లపై కోపం తెచ్చుకుంటాము. ఇక ఈ సినిమాలో వచ్చే సీన్స్ ని cliche అనాలి. చాలా భాగం గతంలో మనం చూసేసినవే. ఊహించేవే కావటం ఓ విశేషం. అయితే డైరక్టర్ ఒకటి అనుకుని ఉండచ్చు...ఈ జనరేషన్ వాళ్లు తన సినిమా లు చూసి ఉండరు కాబట్టివాళ్లు ఎంజాయ్ చేస్తారని. వాళ్లెవరు థియేటర్ కు కదిలి వెళ్లటం లేదాయే. అయినా ఇంటర్వెల్ తర్వాత ఐటమ్ సాంగ్ ఇంకా ఈ రోజుల్లో అవసరమా..అసలే ఎప్పుడు సినిమా అయ్యిపోతుందా అని ఎదురుచూసేవాళ్ళకు ...క్లైమాక్స్ అయ్యాక కూడా సినిమా చూపించటం ఏమిటి....
Plus Points:
కొన్ని సీన్స్, డైలాగులు
కెమెరా వర్క్
సెకండాఫ్ లో అక్కడక్కడా
Minus Points:
రొటీన్ కథ
బోర్ కొట్టించే కథనం
విలన్స్ ..హీరోని కాకుండా చూసేవారిని ఇరిటేట్ చేస్తూండటం
ఎమోషన్స్ అనేవి ఎక్కడా లేకపోవటం
నటీనటుల ఫెరఫార్మెన్స్
ఈ సినిమాతో హీరోగా పరిచయఅభిరామ్ దగ్గుబాటి ఇంతకు మించి ఎక్సపెక్ట్ చేయద్దు అన్నట్లు ఒకే ఒక ఎక్సప్రెషన్ తో సినిమా మొత్తం లాగేసాడు. అందుకే డైరక్టర్ కొన్ని సీన్స్ లో అతన్ని చూపటానికి కూడా ఇష్టపడలేదు. కెమెరా ఎక్కడో తిరుగుతూంటుంది. గీతికా తివారి బాగా చేసింది, సద (Sada) కొత్తగా చెప్పేదేముంది .మిగాత ఆర్టిస్ట్ లు సోసో.
టెక్నికల్ గా చూస్తే...
తేజ వంటి గొప్ప టెక్నీషియన్ నుంచి ఇలాంటి సినిమా పొరపాటున కూడా ఎక్సపెక్ట్ చేయం..ఎవరు ఎక్సపెక్ట్ చేయమన్నారు అంటే చేయగలిగిందీ లేదు.తినగ తినగ వేము తియ్యనుండు అనేది ఈయన విషయంలో రివర్స్ లో నడుస్తోంది. సమీర్ రెడ్డి (SameerReddy)కెమెరా వర్క్ బాగుంది, అడవులు ,చెట్లు ,పుట్టలు బాగా చూపించారు. ఇక ఆర్ఫీ పట్నాయక్ నుంచి అప్పటి మ్యాజిక్ ఆసించలేదు. జస్ట్ ఓకే . ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే
Final Thoughts:
నిజం చెప్పండి తేజ గారూ మీకు ఆ కుర్రాడి మీద కానీ వాళ్ల నాన్నగారు సురేష్ బాబు గారి మీద కోపం ఉంది కదా..లేకపోతే పాపం..ఎంట్రి సినిమానే ఇలా .... చేసారేంటండి..
--సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్ : 2/5
Ahimsa
నటీనటులు : అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు
మాటలు : అనిల్ అచ్చుగట్ల
పాటలు : చంద్రబోస్
ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి
సంగీతం : ఆర్పీ పట్నాయక్
నిర్మాత : పి. కిరణ్ (జెమినీ కిరణ్)
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : తేజ
విడుదల తేదీ: జూన్ 2, 2023