వంటలక్కగా మారిన హీరోయిన్ ఇలియానా... ఒకప్పటి స్టార్ హీరోయిన్ కి ఈ పరిస్థితా!

First Published May 15, 2021, 9:48 AM IST

స్టార్ డమ్, ఫార్మ్ కోల్పోతే హీరోయిన్స్ పరిస్థితి దారుణంగా మారుతుంది. అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పరిశ్రమ పట్టించుకోవడం కూడా మానేస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా పరిస్థితి ఇప్పుడు అలానే తయారైంది.

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ పరుగెడుతున్న సమయంలో బాలీవుడ్ కి వెళ్లి కెరీర్ నాశనం చేసుకుంది. అక్కడ వచ్చిన ఆడపడదడపా అవకాశాలకు టెంప్ట్ అయ్యి, ఇక్కడ భారీ ఆఫర్స్ వదులుకుంది.
undefined
ఎంతో రిస్క్ చేసి బాలీవుడ్ పై ఫోకస్ పెడితే అక్కడ అనుకున్నంత సక్సెస్ రాలేదు. సెకండ్ హీరోయిన్ స్థాయికే ఇలియానా ఇమేజ్ పరిమితం అయ్యింది. దీనితో కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలుక ఊడిందన్న తీరుగా ఇలియానా నష్టపోయింది.
undefined
టాలీవుడ్ ప్రేక్షకులు ఇలియానాను పూర్తిగా మర్చిపోయారు. ఆ మధ్య శ్రీను వైట్ల రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని మూవీ కోసం ఇలియానాను తీసుకున్నారు. ఆ మూవీ ఘోర పరాజయం నేపథ్యంలో ఇలియానా కెరీర్ మరింత మసకబారింది.
undefined
దీనికి తోడు ఆస్ట్రేలియా ప్రియుడు ఆండ్రూతో బ్రేకప్ ఇలియానాను మానసిక వేదనకు గురిచేసింది. డిప్రెషన్ తో కెరీర్ ని సైతం పక్కన పెట్టేసింది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకటి రెండు ఆఫర్స్ ఇలియానా చేతిలో ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కాదు.
undefined
ఇక లాక్ డౌన్ వలన షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంట్లో ఉంటూ వంటలు చేసుకుంటుంది ఇలియానా. తాజాగా తాను ఇంట్లో తయారు చేసి కొన్ని డిషెస్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది.
undefined
అయితే తన కెరీర్ కి ప్రత్యామ్నాయం కుకింగ్ అంటూ ఇలియానా కామెంట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. సినిమాలు లేకపోతే వంటలు చేసుకుని బ్రతికేస్తా, అది కూడా ఓ కెరీర్ గా ఉందని ఇలియానా చెప్పడం షాకిస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఇలియానా వంటలక్కగా మారడం ఊహించని పరిణామమే.

ileana

కాగా అభిషేక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బిగ్ బుల్ మూవీ విడుదల కాగా అందులో ఇలియానా హీరోయిన్ గా నటించారు. అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే మరో చిత్రంలో ఇలియానా నటిస్తున్నారు.
undefined
click me!