ఇండియా గర్వించదగ్గ రైటర్‌, స్టార్‌ డైరెక్టర్‌కి ఫాదర్‌.. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌

Published : May 14, 2025, 11:11 AM IST

రాజమౌళి ఫాదర్‌ విజయేంద్రప్రసాద్‌ రైటర్‌గా ఎంతటి గొప్ప పేరు ఉందో తెలిసిందే. అనేక సంచలన చిత్రాలకు ఆయన కథ అందించారు. కానీ దర్శకుడిగా మాత్రం సక్సెస్‌ కాలేదు.   

PREV
16
ఇండియా గర్వించదగ్గ రైటర్‌, స్టార్‌ డైరెక్టర్‌కి ఫాదర్‌.. కానీ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌

సినిమా పరిశ్రమలో ఒక విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. రైటర్‌గా రాణించిన వాళ్లు దర్శకుడిగా సక్సెస్‌ కావడం కామనే. కానీ ఒక దేశం గర్వించదగ్గర రైటర్‌ మాత్రం డైరెక్టర్‌గా ఫెయిల్‌ అయ్యారు. ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాపే కావడం గమనార్హం. పైగా ఆయన మరో దేశం గర్వించదగ్గ డైరెక్టర్‌ కి తండ్రి కావడం విశేషం. 

26

ఇప్పటికే ఆయన ఎవరో అర్థమై ఉంటుంది. అవును.. ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేసిన, పాన్‌ ఇండియా ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన, సినిమాకి భాష అనే బార్డర్స్ ని బ్రేక్‌ చేసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కావడం విశేషం.

విజయేంద్రప్రసాద్‌ ఇండియన్‌ సినిమాకి ఎన్నో గొప్ప కథలు అందించారు. రాజమౌళి తీసే ప్రతి సినిమాకి ఆయనే రైటర్‌. కేవలం రాజమౌళికే కాదు, ఇతర డైరెక్టర్లకి కూడా కథలు ఇచ్చారు. వాటిలో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన చిత్రాలుండటం విశేషం. 
 

36

విజయేంద్రప్రసాద్‌ రైటర్‌గా పాపులర్‌. ఆయన కథ రాస్తే అది పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందని అంటుంటారు. అయితే దర్శకుడిగానూ ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దర్శకుడిగా రాణించాలని శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ సక్సెస్‌ కాలేకపోయారు. `జానకీ రాముడు` చిత్రంతో కథ రచయితగా ఫస్ట్ బ్రేక్‌ అందుకున్నారు విజయేంద్రప్రసాద్‌. 

46

రైటర్ గా సక్సెస్‌ సాధించారు. ఆయన అందించిన కథలు చాలా వరకు విజయాలు సాధించాయి. దీంతో తానే దర్శకుడిగా మారాలనుకున్నారు. డైరెక్టర్‌గా నిరూపించుకోవాలని భావించారు.

ఈక్రమంలో 1996లో `అర్థాంగి` చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. దీనికి కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మరో దర్శకుడు. ఆనంద్‌, రవళి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతకు భారీ నష్టాలను తీసుకొచ్చింది. 
 

56

దీంతో మళ్లీ కొంత కాలం డైరెక్షన్‌కి దూరంగా ఉన్నారు విజయేంద్రప్రసాద్‌. పదేళ్ల తర్వాత `శ్రీకృష్ణ` అనే చిత్రంతో మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు. శ్రీకాంత్‌, వేణు హీరోలుగా నటించిన ఈ మూవీ సైతం డిజాస్టర్‌ అయ్యింది.

మళ్లీ కొంత గ్యాప్‌ తీసుకుని నాగార్జునతో `రాజన్న` సినిమాని తెరకెక్కించారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌ గా అంతగా సక్సెస్‌ కాలేదు. పైగా ఇందులో చాలా పార్ట్ రాజమౌళి డైరెక్ట్ చేశాడట. దీంతో కొంత బెటర్‌గా నిలిచింది. కానీ నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది. 

66

ఇక చివరగా ప్రయోగాత్మక మూవీ `శ్రీవల్లి`ని రూపొందించారు. సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.

ఇలా విజయేంద్రప్రసాద్‌ దర్శకుడిగా చేసిన ప్రతి సినిమా నిరాశ పరిచింది. దీంతో ఇక డైరెక్షన్‌ జోలికి వెళ్లదలుచుకోలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి, మహేష్‌ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఎస్ఎస్‌ఎంబీ 29` చిత్రానికి కథ అందిస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories