ఈ వివాదం ఇలా ఉంటే నరేష్, పవిత్ర లోకేష్(Pavitra Lokesh) పై హైపర్ ఆది వివాదాస్పద కామెంట్స్, సెటైర్లు వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో సీరియల్స్, కామెడీ షోస్ కి సంబంధించిన జంటలను దించారు. ఈ జంటల్లో ఒకరిని హైపర్ ఆది నీ పేరు ఏంటని అడిగాడు. అతను నరేష్ అని చెప్పాడు. ఆయన పక్కన ఉన్న జోడీ అమ్మాయి పేరు పవిత్రగా పరిచయం చేశాడు. అయితే వీడు నరేష్, ఆమె పవిత్ర... అయితే ఇంకా... అంటూ సైలెంట్ అయ్యాడు.