బాబోయ్ యాష్మి..ఏంటి ఇలా బూతులు మాట్లేడేస్తోంది..నామినేట్ చేసిన పాపానికి మణికంఠపై పగ పట్టేసింది

First Published | Sep 16, 2024, 11:05 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడవ వారం మొదలైపోయింది. డే 15 లో హైలైట్ అయిన అంశాలు అంటే ముందుగా చెప్పాల్సింది నామినేషన్ ప్రాసెస్ గురించే. ప్రతిసారి నామినేషన్ ప్రాసెస్ మొదలైతే కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఎలా తిట్ల దండకం మొదలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మూడవ వారం మొదలైపోయింది. డే 15 లో హైలైట్ అయిన అంశాలు అంటే ముందుగా చెప్పాల్సింది నామినేషన్ ప్రాసెస్ గురించే. ప్రతిసారి నామినేషన్ ప్రాసెస్ మొదలైతే కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఎలా తిట్ల దండకం మొదలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మూడవ వారం నామినేషన్ ప్రాసెస్ లో ఆ హీట్ ఇంకా పెరిగింది. అసలు డే 15లో  ఏం జరిగిందో కంప్లీట్ గా ఇప్పుడు తెలుసుకుందాం. 

సీత నామినేషన్ ప్రాసెస్ ని ప్రారంభించింది. వ్యర్థం అనే పేరుతో ఈ నామినేషన్స్ ప్రక్రియని మొదలు పెట్టారు. అంటే కంటెస్టెంట్స్ లో వ్యర్థాలు లాగా పేరుకుపోయిన బ్యాడ్ క్వాలిటీస్ ని వదిలేయాలి అనే ఉద్దేశంతో పేరు అలా పెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. కారణాలు చెప్పి వాళ్ళ తలపై చెత్త పోయాలి. 


కిర్రాక్ సీత నామినేషన్స్ ముందుగా యాష్మిని నామినేట్ చేసింది. ఆమె చీఫ్ గా ఉన్నప్పుడు క్లాన్ ని సరిగ్గా కంట్రోల్ చేయలేదని, పక్షపాత ధోరణి ప్రదర్శించింది అని రెండు మూడు కారణాలు చెప్పింది. అదే విధంగా పృథ్వీని కూడా నామినేట్ చేస్తూ పక్కనోళ్ళని తొక్కి ఎదగాలనే లక్షణం తనలో నచ్చలేదని సీత తెలిపింది. విష్ణుప్రియ అయితే ప్రేరణ, యాష్మి ఇద్దరినీ నామినేట్ చేస్తూ కొన్ని కారణాలు చెప్పింది. ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ కావడం.. యాష్మి ఎవరు వీక్ గా ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తుందని.. ఇలా కొన్ని కారణాలని విష్ణుప్రియ పాయింట్ అవుట్ చేసింది. 

మణికంఠ.. యాష్మి, పృథ్విని నామినేట్ చేశాడు. మణికంఠ, యాష్మి ఇద్దరూ ఆర్గుమెంట్ చేసుకుంటూ లిమిట్ క్రాస్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే యాష్మినే సహనం కోల్పోయింది. ఆమె నోటి వెంట 'ఏంటి బొక్కా' అనే బూతులు కూడా వచ్చాయి. దీని వల్ల యాష్మి నెగిటివిటి మూటగట్టుకునే ప్రమాదం ఉండొచ్చు. నామినేషన్ ప్రాసెస్ లో తీవ్రంగా ఆర్గుమెంట్ చేసుకున్నది వీళ్ళిద్దరే. యాష్మి పక్షపాత ధోరణిని మణికంఠ కూడా పాయింట్ అవుట్ చేశాడు. అదే విధంగా హౌస్ లో ప్రతి విషయాన్ని కెలుకుతూ తన ఆధిపత్యం చేయాలాయించాలని యాష్మి ప్రయత్నిస్తున్నట్లు మణికంఠ ఆరోపించాడు. 

దీనితో యాష్మి బరస్ట్ అయిపోయింది. మణికంఠతో వాగ్వాదానికి దిగింది. ఇంతకాలం నువ్వు నా దగ్గర ఫ్రెండ్ లాగా డ్రామా చేసావు అంటూ యాష్మి ఆరోపించింది. నీలో బ్యాడ్ క్వాలిటీ ఉంటే తప్పకుండా రైజ్ చేస్తా అని మణికంఠ అన్నాడు. ఏందీ రైజ్ చేసేది నువ్వు బొక్కా అంటూ యాష్మి నోరు జారింది. నోరు అదుపులో పెట్టుకో అంటూ మణికంఠ వార్నింగ్ ఇచ్చాడు. 

పృథ్వికి క్షణికావేశం ఎక్కువ అంటూ అతడిని మణికంఠ నామినేట్ చేశారు. ఇక ప్రేరణ.. కిర్రాక్ సీతని, విష్ణుప్రియని నామినేట్ చేసింది. సీతకి ఎమోషనల్ వీక్ నెస్ ఉంది అనే పాయింట్ చెప్పింది. సీత ఏమాత్రం తగ్గలేదు. నీకు ఉండవా ఎమోషన్స్ అంటూ తిరిగి ప్రశ్నించింది. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య సిల్లీగా ఎగ్స్ గురించి గొడవ జరిగింది. 

ఆదిత్య ఓం.. విష్ణుప్రియ, మణికంఠని నామినేట్ చేశాడు. ఎప్పటిలాగే తన పాయింట్స్ ని బలంగా చెప్పలేక ఆదిత్య ఓం తేలిపోయాడు. యాష్మి అయితే మణికంఠపై పగ పట్టేసింది అని చెప్పొచ్చు. ఆమె మణికంఠ, నైనికా ఇద్దరినీ నామినేట్ చేసింది. తాను హౌస్ లో ఉన్నన్ని రోజులు మణికంఠని నామినేట్ చేస్తూనే ఉంటా అంటూ యాష్మి అగ్రెసివ్ గా వార్నింగ్ ఇచ్చింది. మణికంఠ చేసిన ఆరోపణల వల్ల తన హార్ట్ బ్రేక్ అయింది అంటూ యాష్మి ఎమోషనల్ అయింది. ఆఫ్రిది కూడా యాష్మిని నామినేట్ చేశాడు. ప్రేరణ సంచాలక్ గా ఫెయిల్ అయింది అనే కారణంతో ఆమెని నామినేట్ చేశాడు. 

హౌస్ లో నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్ లు కాబట్టి వాళ్ళకి నామినేషన్ వర్తించదు అంటూనే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. నిఖిల్,అభయ్ లలో ఒకరు మాత్రమే నామినేషన్ నుంచి సేఫ్ అవుతారు. ఒకరు నామినేట్ కావలసిందే. అది ఎవరో వాళ్లిద్దరే తేల్చుకోవాలి అంటూ మెలిక పెట్టారు. నిఖిల్ ఆల్రెడీ రెండు సార్లు నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి అభయ్ అతడి కోసం త్యాగం చేశాడు. నామినేషన్ నుంచి సేఫ్ గా బయటపడగలననే నమ్మకంతో తాను నామినేట్ అవుతున్నట్లు అభయ్ బిగ్ బాస్ కి చెప్పాడు. ఫైనల్ గా ప్రేరణ, నైనికా, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యాష్మి, అభయ్.. ఇదీ మూడవ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్. 

Latest Videos

click me!