Sreemukhi: చలిలో సెగలు పుట్టించేలా శ్రీముఖి సాలిడ్ ఫిగర్... ఆమె అందాలు చూస్తే ఆకలి కూడా వేయదు!

First Published Jan 28, 2023, 4:18 PM IST


రోజుకో రకంగా అందాలు ప్రదర్శిస్తుంది శ్రీముఖి. ఈ బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ ఫోటో షూట్స్ మెంటల్ తెప్పిస్తున్నాయి. 
 

Sreemukhi

మిల్కీ రోజ్ ఫ్రాక్ శ్రీముఖికి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఆమె గ్లామర్ ని మరింత ఎలివేట్ చేసింది. స్టార్ యాంకర్ అందాలతో జనాల కడుపు నిడిపోతుండగా ఆకలి కూడా మర్చిపోతున్నారు. అంతగా మైమరిపిస్తోంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పాపులారిటీ ఓ రేంజ్ లో పెరుగుతుంది. 

Sreemukhi


ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. యాంకర్ గా, నటిగా, ప్రమోషన్స్ ద్వారా భారీగా ఆర్జిస్తోంది.శ్రీముఖి సంపాదన కోట్లకు చేరిన నేపథ్యంలో ఇటీవల లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో సొంతింటి కల నెరవేర్చుకున్నారు. 
 

Sreemukhi

జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్, అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది.

Sreemukhi

పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.బిగ్ బాస్(Bigg Boss)  సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 

Sreemukhi


స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 
 

Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. 

Sreemukhi

శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలైంది. అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ ఇచ్చే రోల్ కోసం శ్రీముఖి ఎదురుచూస్తున్నారు. అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.
 

Sreemukhi

  కాగా శ్రీముఖి వివాహం అంటూ కొద్ది రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని. హైదరాబాద్ కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో చాలా కాలంగా శ్రీముఖి రిలేషన్ లో ఉన్నారని. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారని. త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందని కథనాలు వెలువడ్డాయి.
 

Sreemukhi

ఈ వార్తలపై శ్రీముఖి మండిపడ్డారు. ప్రేమ, పెళ్లి అంటూ నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి కొడుకు అంటూ ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్ళికి మూడు నాలుగేళ్ళ సమయం ఉందన్న శ్రీముఖి... కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తా అన్నారు.  

click me!